సముద్రం లాగా ఆమె
లోపలెంత అలజడి ఉన్నా
బయట అంతా ప్రశాంతం
అప్పుడప్పుడూ మాత్రమే తన కళ్ళల్లో
తుపానులు రేగుతూ ఉంటాయి
వాటన్నిటినీ చీర కొంగులో
మెల్లగా
దాచేసుకుంటుందామె
మళ్ళీ తన కళ్లలోని ఆకాశాలు
నిర్మలమవుతాయి
పసి చిరునవ్వొకటి
పెదాల పైకి పారాడుతుంది
అదొక రెండవ ఉదయం
తన ప్రపంచానికీ
ఆ ప్రపంచంలో తిరుగాడే
నాకు
లోపలెంత అలజడి ఉన్నా
బయట అంతా ప్రశాంతం
అప్పుడప్పుడూ మాత్రమే తన కళ్ళల్లో
తుపానులు రేగుతూ ఉంటాయి
వాటన్నిటినీ చీర కొంగులో
మెల్లగా
దాచేసుకుంటుందామె
మళ్ళీ తన కళ్లలోని ఆకాశాలు
నిర్మలమవుతాయి
పసి చిరునవ్వొకటి
పెదాల పైకి పారాడుతుంది
అదొక రెండవ ఉదయం
తన ప్రపంచానికీ
ఆ ప్రపంచంలో తిరుగాడే
నాకు