Right disabled

Sunday, June 21, 2020

**the silent whisperers**

శబ్దం లేనితనాన్ని చూసావా ఎప్పుడైనా

కాస్త దగ్గరగానైనా గాలి, మిగితా సవ్వడులు లేకపోవడం

కొద్దిగా తెలిస్తే

నువ్వేమవుతావో తెలుసా?

 

పిచ్చి పడుతుంది కదూ

ఇదంతా ఇప్పుడు చెబుతున్నానని

నాకు పిచ్చనిపిస్తుంది, కాదూ?

 

We are born with silence at our fingertips

Did you observe

Lying on our backs

We look at our fingertips

Move them mysteriously

And smile and giggle without a reason

 

మునివేళ్ళ వెంబడి నిశ్శబ్దమలా

మెరుపుల్లా కదులుతూ ఉంటుంది

ఇది పోలిక మాత్రమే

వినికిడి అవసరమే ఉండదసలు

కంటికి కూడా తెలీదంతే

 

నిశబ్దం గురించి మాటల్లో చెప్పవలసి వస్తోందనే నా బాధల్లా

పెదాలు విచ్చుకునేందుకు ఎంత శబ్దం చెయ్యాలి?

నీకు తెలీదా

నేను చెప్పాలా

 

గుసగుసలాడటమే వినబడకపోతే

నిశ్శబ్దంగా గుసగుసలాడటం గురించి ఏం చెప్పగలం

 

పైకి చూస్తూ నీలిరంగు దాటిపోతే

అంతా దారుణమైన శబ్దం లేనితనమే

 

సముద్రం బాగుంది కదా అని లోతుకు పోతే

అదోరకమైన భారమైన నిశ్శబ్దం

 

ఇక నేను అదెలా ఉంటుందో చెప్పలేను

నీకు తెలిస్తే నువ్వేమైనా చెప్పగలవా ఏమిటి?

 

ఇదీ అంతే

నీకైనా నాకైనా

 

This is why we are known as

Silent whisperers

 

We just don’t speak

We propagate the language of nothingness

 

అర్థం కాలేదా?

 

Mingle with us

We’ll let you know

 

Let’s get the taste of it

 

ఊరకనే కాదులే

ప్రతిదానికీ ఖరీదు ఉంటుంది

 

After all

What’s free in this world!

 

కన్ను కొట్టి పిలిచిన సంగతి నీకు తెలీనేలేదు కదూ

నిశ్శబ్దమంత బాగుంటుంది మరి

Wednesday, June 17, 2020

**sea and the dampened walls**

మెత్తటి పచ్చటి నాచు మొక్కలు కొన్ని

అలా ఆ తడిసున్న గోడ వెంబడి పెరుగుతాయి

అదొక కాంక్షపూరిత ప్రేమ

 

అరేబియా సముద్రపొడ్డున

కొన్ని ఊదారంగు గవ్వ పెంకులు

వెతకబడి వెతకబడి

ఏ మెత్తటి చేతిలోనో కాన్కలవుతాయి

ఇదొక మురిపెమైన ప్రేమ

 

కురిసిన వర్షానికి గుర్తుగా

మందారాలపై ముద్దు మరకలు

దీన్నేమనాలో తెలీదు మరి

 

I search for eloped memories

I run along those high dampened walls

That’s an unending maze

 

I sit on the rock

Facing the sea

The salty air stitches the wounds

It heals me slowly, breeze by breeze

 

ఒకప్పుడు పిచ్చెక్కినట్టు నే తిరిగిన ప్రపంచమే

ఇప్పుడు నాకు సాంత్వన

 

నాకిప్పుడు ఏమీ చేయాలనిపించదు

సముద్రమిచ్చినంత భరోసా ఇస్తావా నువ్వు

 

I sit there

Like a puppy blinking its tiny innocent eyes

 

I ask myself, why tears are salty

How silly of me!

She answers, I live inside you

 

నేను రోజూ వచ్చి చూస్తున్నందుకు కాబోలు

 

Still those walls stand tall

Defying the laws of sea

 

But they will fall one day

Or they will become my memories

 

My aspect lives in them


Monday, June 15, 2020

**the birth**

ఇలా కాలి బూడిదై

మళ్ళీ అందులోంచి

నిద్ర లేచినట్లు ఒళ్ళు విరుచుకుంటూ పుట్టడం

నాకలవాటే

 

Do not hesitate to look at me

When I turn into ashes and drop down

 

ఈ సారి

ఆ కాన్వాసు దగ్గరున్న పాలెట్ తీసుకొచ్చి

బూడిదలోకి కొన్ని రంగుల్ని చల్లు

ప్రతిసారీ కొత్త రంగుల రెక్కలతో పుట్టడం బాగుంటుంది

 

May be this time

You can know my actual colours

For it is you, who decided them

 

నువ్వు నన్ను తీర్చావని కాదు

నేను నీతో తీర్చబడ్డానని

Thursday, June 11, 2020

**the significant one**

కాగితపు పడవనొకదాన్ని పట్టుకుని

సముద్రపొడ్డున నిలబడతాను

 

ఆశ కదూ

అంత సముద్రాన్ని దాటేద్దామని

 

I aim to the invisible shores

I don’t know how to navigate

Or maneuver

 

పడవ చేయడం కోసం

పేజీ చించిన పుస్తకం మాత్రం

చిరిగిన గుర్తుతో మిగిలిపోతుంది

 

కొన్ని సందిగ్ధాలు కూడా అసంపూర్ణాలే

అనుకోవడానికి కూడా ఏదో అడ్డు

 

Not I know you

Not I look for you

But I long for you

Like a feather in the air

Neither connected nor devoid of being pursued

 

వెలుపలా లోపలా గాలొక్కటే

వేగము, చలనము వేరు

 

ఉన్నట్టు తెలిసినా కనబడనిది

ఊపిరి

 

It happens on condition yet uncontrollable

Breath is the only thing

An unconditionality based on a condition

 

కలగన్న ప్రతిసారీ కనులు మూసి ఉండాల్సిన పనిలేదు

అది నువ్వే

సగం మూతలుపడ్డ కళ్ళలోకి దూకే స్వప్నధారవు

 

Mind cleans away thoughts in the form of dreams

But you,

You are that one pursuit

You mend it

 

పడవ ఒడ్డుకు చేరాలా లేక సముద్రపు అడుగునకా

రెండూ తీరాలే అనిపిస్తుంది

కొద్ది తేడాతో

 

This is what you are

Right?

Saturday, June 6, 2020

**the flowy glow**

బ్రతుకులు పండిపోవాలనే కదూ

అంతలా పరుచుకుంటావు

రాగి కంకులు మెరుస్తాయి

సీతమ్మ జొన్న కంకులు తళుక్కుమంటాయి

 

ఎంత హాయి ఈ రేయి అని

ఏ దూరాలలోనో లీలగా రేడియో పాడుతుంది

 

That moment

When you drag me on to you

How did I miss those eyes

Shining a mysterious light

Singing a known but silly song

 

ఏరువాక పున్నమి వెలుగు

పైనుంచీ కొంత

తన నుంచీ చాలా

 

ఉప్పాడ చీరంత పల్చన

గద్వాలు చీరంత మెల్లన

పైఠణీ చీరంత వెచ్చన

 

You fall silently upon us

Like a fabric of heavens

 

కురిస్తే వేగిపోవడం

తడిసి మండిపోవడం

మొదటిసారి గుసగుసలాడిన కబురు

 

ఒకానొక మంచె మీద

బ్రతుకులు పండిపోవాలనే కదూ

ఇంతలా పరుచుకుంటావు

 

కానుగ చెట్ల గాలి తడిమితే

మిణుగురులు కాపలానా

 

I like to lie beside you

Relaxed and rejoicing

Feeling your breath

 

పచ్చటి వెన్నల పూచిన చేను

మరుసటి పున్నమికి మళ్ళీ తయారవుతుంది

 

We will be there

When it happens again