కాగితపు
పడవనొకదాన్ని పట్టుకుని
సముద్రపొడ్డున
నిలబడతాను
ఆశ కదూ
అంత సముద్రాన్ని
దాటేద్దామని
I aim to the invisible shores
I don’t know how to navigate
Or maneuver
పడవ చేయడం కోసం
పేజీ చించిన
పుస్తకం మాత్రం
చిరిగిన గుర్తుతో
మిగిలిపోతుంది
కొన్ని సందిగ్ధాలు
కూడా అసంపూర్ణాలే
అనుకోవడానికి
కూడా ఏదో అడ్డు
Not I know you
Not I look for you
But I long for you
Like a feather in the air
Neither connected nor devoid of being pursued
వెలుపలా లోపలా గాలొక్కటే
వేగము, చలనము
వేరు
ఉన్నట్టు
తెలిసినా కనబడనిది
ఊపిరి
It happens on condition yet uncontrollable
Breath is the only thing
An unconditionality based on a condition
కలగన్న ప్రతిసారీ
కనులు మూసి ఉండాల్సిన పనిలేదు
అది నువ్వే
సగం మూతలుపడ్డ
కళ్ళలోకి దూకే స్వప్నధారవు
Mind cleans away thoughts in the form of dreams
But you,
You are that one pursuit
You mend it
పడవ ఒడ్డుకు
చేరాలా లేక సముద్రపు అడుగునకా
రెండూ తీరాలే అనిపిస్తుంది
కొద్ది తేడాతో
This is what you are
No comments:
Post a Comment