Right disabled

Saturday, June 6, 2020

**the flowy glow**

బ్రతుకులు పండిపోవాలనే కదూ

అంతలా పరుచుకుంటావు

రాగి కంకులు మెరుస్తాయి

సీతమ్మ జొన్న కంకులు తళుక్కుమంటాయి

 

ఎంత హాయి ఈ రేయి అని

ఏ దూరాలలోనో లీలగా రేడియో పాడుతుంది

 

That moment

When you drag me on to you

How did I miss those eyes

Shining a mysterious light

Singing a known but silly song

 

ఏరువాక పున్నమి వెలుగు

పైనుంచీ కొంత

తన నుంచీ చాలా

 

ఉప్పాడ చీరంత పల్చన

గద్వాలు చీరంత మెల్లన

పైఠణీ చీరంత వెచ్చన

 

You fall silently upon us

Like a fabric of heavens

 

కురిస్తే వేగిపోవడం

తడిసి మండిపోవడం

మొదటిసారి గుసగుసలాడిన కబురు

 

ఒకానొక మంచె మీద

బ్రతుకులు పండిపోవాలనే కదూ

ఇంతలా పరుచుకుంటావు

 

కానుగ చెట్ల గాలి తడిమితే

మిణుగురులు కాపలానా

 

I like to lie beside you

Relaxed and rejoicing

Feeling your breath

 

పచ్చటి వెన్నల పూచిన చేను

మరుసటి పున్నమికి మళ్ళీ తయారవుతుంది

 

We will be there

When it happens again

No comments:

Post a Comment