Right disabled

Sunday, May 31, 2020

**the deep**

బాగుంటుంది

బాల్కనీకి కట్టిన తెరల ఊగిసలాట

అవి కొంత తప్పుకున్నప్పుడల్లా

మెరుస్తూ కనిపించే సముద్రం

 

Do you know

Those blinds can’t stay put

They always want to touch the breeze

They are full of lust

 

గట్టుమీద బెంచిపై కూర్చుని

పల్చటి ఒంటరితనాన్ని శ్వాసిస్తున్నప్పుడల్లా

అటు రమ్మని ఒక పిలుపు

 

ఎప్పుడో ఏదో ఒకానొక రోజు

సముద్రం ఈ చోటును ముంచేస్తుంది కదా అని

లీలగా ఒక ఆలోచన

 

ఎత్తులన్నీ లోతులైపోతాయి కదూ

 

I can say now

What’s high today will be a trench one day

I am so sure that I am in unreachable depths

 

ఈదడం కన్నా నీటికి అలవాటు పడటం

లోతుకి జారిపోతున్నా

అక్కడున్న దారుణమైన నిశబ్దాన్ని

కిమ్మనకుండా తీసుకోవడం

 

This is damn good you know

Its not about strength

It is purely evolutionary

 

ఇప్పుడేం తక్కువా

గిజగిజలాడే ప్రపంచంలో కూడా

ఊపిరిసలపని రోజొకటి

అప్పుడప్పుడూ రాలేదా

 

ఊపిరి అందనీయని భావమొకటి

ముందరి కాళ్ళకు అడ్డుపడలేదా

 

The upside is not less than the downs

Many times, it is good to go low

 

వెలుతురును వదిలేసి కొంతకాలం

మసకల్లోనే మసలుదాం

నీడల్లో ఒదిగిపోదాం

 

What say, my dear

Let us get smeared with some dark

Let us get piously tarnished

 

చీకటికి ప్రతీకవై నా చేయందుకో

నీడనై నే ప్రతి దీపానికీ విశ్రాంతినిస్తా

 

Let the canopy float above us

No comments:

Post a Comment