ఈ సందిగ్ధ శరీరాల
రూపుమాపులు
తెలిసే కొద్దీ కదూ
కొద్ది కొద్దిగా
మనసులు విచ్చుకుందీ
ఒకరివైపొకరు తిరిగి
ఒత్తిగిలి పడుకుందీ
ప్రేమించుకుందీ
When you draw on my cheek
With your pointing finger
నా ప్రాణరేణువులు
నీ వేలి చివర్ల వెంబడి
బొంబాయి మిఠాయి
వాడి బండి చుట్టూ
పిల్లలు
పరుగులెత్తినట్టుగా పరిగెడతాయి
Did I exaggerate this?
I think so, but this is the comparison I can come up with
So that you can laugh at my naive expression
ఒక్కోసారి
అద్దంలో చూసుకుని తడబడతాను
నా ముఖంలో నీ
ముఖం కనిపిస్తుంది మరి
మురిపెమంతా
తీర్చుకున్న అద్దం
ఆవిరులు
పొంగించుకుని మసకైపోతుంది
Yet you stay quiet
As if you were the praying mantis
I can listen to your smile
So silent it is
నన్నెవరైనా చూస్తే
ఎవరో నాకు పదే పదే అమృతాన్ని తాగిస్తున్నారని
కచ్చితంగా
అనుకుంటారు
How can I tell them
That you are the one who fills new life into me
Your essence runs in all the thoughts I make
They burn with love
ఆలోచనారహిత
స్థితిని
నాకు దగ్గరి
పరిచయంగా మార్చిన దానవు
నాకు నిన్ను చూస్తే
కొన్ని సార్లు భయం కలుగుతుంది కూడా
Oh, my dear superior being
Taking me into your fold is inevitable
And I aspire that
అనుభవసార మథన కదనకుతూహలవు
నీవు నేర్పునది
జననమరణాతీత విద్య
I travel with your waves
No comments:
Post a Comment