Right disabled

Monday, May 25, 2020

**the unsung times**

ఈ శరీరవాంఛలకావల నిన్ను కౌగిలించుకున్న తీరాలు నాకు గుర్తే

నా హృదయకాంక్షల కంచె నిన్ను నన్ను కాచుకున్నదీ నాకు గుర్తే

 

Why didn’t you tell me that it was momentary?

And momentary means just thousands of years

 

ఈ కాలమంటూ చాలదని నీకు తెలియనిది కాదు

నీవు చరాచర జీవరాశుల ముందు దానివి

 

నీకన్నా ఆలస్యంగా నేనొస్తేనేం

నీ ముందు నీ సేవకై మోకరిల్లాక

నేను నీ పరమైపోలేదా

 

కాలాతీత కన్యకాకాంతివి

నన్నొక్కసారి నీ కాంతి కణజాల చైతన్యంలో ఏకం చేసేసుకో

నీ సొంతం అన్న ఆలోచన చాలు

 

I just want to be a minute particle in your multiverse

 

ఆద్యంతాల జాడలు తెలిసినదానవు

నా ఈ ఎన్నెన్ని జన్మల చాళ్ళలోనో

బ్రతుకు ముక్కలను నాటిన దానవు

నన్ను కోల్పోకూడదనే కదూ

 

You made me a part of your world indigenously

I rise and fall as you want me

 

జన్మాంతర జ్ఞానాన్ని అందించే జ్వాలామాలినివి

 

Don’t burn me in your memories

Just let me take birth

Again and again

To have a night with you

 

క్షణకాల ఆనందవిస్పోటనం చాలు

ఆపై నీ దయ 

No comments:

Post a Comment