Right disabled

Sunday, May 31, 2020

**the unending rain**

కురిసి కురిసి ఆగి

ఆగి ఆగి కురిసి

 

కదిపి కదిపి నిలిపి

తడిపి తడిపి వదిలి

 

పట్టు బిగించింది

విడుపు పాటించింది

ఇద్దరమూ

 

I will always be left to open skies

Where I find nothing but great void

 

అంత నిండిపోవడం నాకే గనక తెలిసి ఉంటే

నిన్ను తాకి పరవశించని క్షణమే ఉండదు

 

ఉన్న పాటుగా ఉరిమితే ఉలిక్కిపడ్డట్టు

నీ పాదాల శబ్దం నిర్లిప్తతను అప్పటికి తొక్కిపడుతుంది

 

నీతో పాటు కురవనిస్తావని

అలా కురవనిచ్చినప్పుడు

ఏ విత్తనం మీదో

ఏ చిగురు మీదో

ఏ చాతక పక్షి గొంతులోనో

ఎదురు చూసి చూసి అలసిపోయిన

రైతు నుదురుమీదో

 

ఎక్కడో ఒక అర్థవంతమైనచోట

 

నీతో అల్లుకున్న ఆలోచనలకు

స్వస్తి పలుకుతాను

 

You stay like that

But I raise again and again for you

From the ground

Or as same as you turn yourself into a cloud

 

వర్షం శబ్దాన్ని అనువదించుకుంటూ

నా భాషలో రాసుకుంటూ

 

కురిసి కురిసి ఆగి

ఆగి ఆగి కురిసి

 

ఇద్దరికీ పెద్ద తేడా లేదు కదూ

 

Formlessness is a form

We manifest like this

 

నిరాకార సౌందర్యదీక్ష నాది

సాకార భావదీప్తి నీది

 

We share the worlds together dear

One at a time, one at a time


No comments:

Post a Comment