మోహశరద్రాత్రుల
కాలమది
ఉదయించి ఉదయించీ
అలసిపోయిన కాలమది
మేలుకుని
మేలుకునీ
అలక నిండిన
కాలమది
You appear like a lightening
Smeared in red
Holding a crescent moon between your lips
మత్తు పూల
గుబాళింపులలో
నిన్ను చూసుకోమని
చెప్పి పోతావు
ఇంకెంత కాలమో
జోగుతూ గడపడం
Pull me out of this tipsy story
Let me taste the nectar of your smile
స్వీయమాయా
ప్రపంచపు ప్రాణశక్తివి
ఆకలిగొన్న
నేనున్నానని గుర్తించు
Cast me into an unending spell
So that I will ever know it’s been your and only your
magic
చలి ఉదయాలనిలా
నిస్సారంగా
గడవనీయకు
కొన్ని చలికాలాలనలా
వెచ్చగా
కరిగిపోనివ్వు
I cannot forgive myself
If I can't have a bit of your warmth
ప్రేమోన్మత్తమద్యపానప్రియా
తత్వశృంగారానురక్తచిత్తా
Just this
No comments:
Post a Comment