Right disabled

Friday, May 29, 2020

**the flowery feet**

ఆడమంటే ఆడవు

అడగకుండానే ఆడి ఆడి

మువ్వలతో ఆటాడుకునే

అందమైన ఆడుదానవు

 

Is that how you dance?

I always get startled

Why does my heart follow the tempo?

 

ఒళ్ళుతెలియని నాట్యోద్రేకంలో

గిరగిరా తిరుగుతూ

నావైపుకు నువ్వు తిప్పిన కళ్ళు

ఝల్లున దూకిన చూపులు

 

చర్నాకోల దెబ్బలు నయమేమో

 

Your eyes know how to play to the tunes of your feet

They lash out the life in me

 

నువ్వు ఆగే సమయానికి

నీ విసురు తట్టుకుని

కళ్ళు తిరగకుండా కుదురుగా నిలబడటం

నా అస్తిత్వానికొక పరీక్ష

 

నీ వేగమొక నాదం

 

The waves you send around come back

Knock me off from my circle

They teach me the outward experiences

 

ఇంతా చేసి నువ్వు అలసేంతగా ఆడి

దగ్గరికొస్తే

నీ నుదురును, ముక్కును, గడ్డాన్ని, బుగ్గల్ని,

చెవుల దగ్గర నూగు జుట్టును

మెరిపించే చెమట

నీ పట్ల శ్రద్ధను పెంచుతుంది

 

My eyes won’t miss a thing

Because your eyes never cease to tease me

 

ఆనందనర్తనకేళీవిలాసినీ

అవ్యక్తాకారసౌందర్యభామినీ

 

You always dance in me


No comments:

Post a Comment