సముద్రం
నేల
ఈ రెండూ ఎప్పుడూ విడిపోలేనంతగా
కలిసే ఉంటాయి
వాటి శరీరాలు ఎప్పుడూ ఒకదానికొకటి
స్పర్శించుకుంటూనే ఉంటాయి
కానీ
అలలు
తీరాన ఇసుక
ఈ రెండూ
వేళ్ళు పెనవేసుకున్న
ఇద్దరు చిన్నపిల్లల చేతులు విడిపోయినట్టు వేరవుతాయి
అలల వెంట వెళ్ళడానికి ఇసుక
ఇసుకను వెంట లాక్కెళ్ళడానికి అలలు
ఇదొక గొప్ప ప్రేమ
లోకానికి
మనకు
నేల
ఈ రెండూ ఎప్పుడూ విడిపోలేనంతగా
కలిసే ఉంటాయి
వాటి శరీరాలు ఎప్పుడూ ఒకదానికొకటి
స్పర్శించుకుంటూనే ఉంటాయి
కానీ
అలలు
తీరాన ఇసుక
ఈ రెండూ
వేళ్ళు పెనవేసుకున్న
ఇద్దరు చిన్నపిల్లల చేతులు విడిపోయినట్టు వేరవుతాయి
అలల వెంట వెళ్ళడానికి ఇసుక
ఇసుకను వెంట లాక్కెళ్ళడానికి అలలు
ఇదొక గొప్ప ప్రేమ
లోకానికి
మనకు