వెయ్యి రేకుల పూవు చాలదా నీకు
నా ఆలోచనల్లో పసి పాపవై పారాడతావెందుకు
జన్మరాహిత్యమే కదా నేను కోరుకుంది
అది తీరనప్పుడు మిగితా కోరికలు ఉంటేనేమి పోతేనేమి
ఆజన్మ స్నేహితుడనై
నీ పక్కనుండాలనే కదా ఇన్నాళ్ళు వేచింది
వేకువ కూడా తీరకుండా
ఎలా వెళ్ళేది?
Unimaginable mischief is your virtue
I am just a spectator
నిన్ను తప్పి ఏమి చేయగల నేర్పుందని
ఇలా తరుముతావు
I asked you one thing
Let me be a string in your weave
ఇంత అల్లరీ నన్ను ఊరించడానికి కాకపోతే
నువ్వేమిటిలా
నేనేమిటిలా
My dear mischief maker
play as you wish
but
grant me your presence
forever
నువ్వు జ్ఞానానివి
నేను పిపాసిని