Right disabled

Wednesday, May 22, 2013

**సంధ్యా కాంత**

ఆమె స్నానం చేసి  తీరికగా తలారబెట్టుకుంటోంది 
తన కళ్లలోని సంధ్యను చూసి 
మైకం కమ్మిన సూర్యుడు  
సముద్రంలోకి జారిపోతున్నాడు 

చిక్కటి చీకటి చీర కట్టుకొచ్చి 
ప్రకృతిని మొత్తం తనతో తీసుకొచ్చి  
నా పక్కన కూర్చుంది 

తన వెలుగులో  
నేను మలిగిపోయాను 

1 comment:

  1. మీ కవిత బాగుంది.
    అభినందనలు.
    ఒక ముఖ్యవిషయం. సంధ్యాకాంత అనాలి సంధ్యకాంత కాదు. దయచేసి సరిజేసుకోఅలరు.

    ReplyDelete