Right disabled

Tuesday, December 16, 2014

**Mirror Mirror**

**Mirror Mirror**

I swing like a pendulum 
In and out
Hugging its philosophy
I become phenomenon and the effect
Of it’s every movement

That is when
My mirror invites me in to it
That is when I face myself
Stare in to my own eyes
I talk to myself

Where I stand is in front of my pretty mirror
The fight goes on
My fists ache and my face bruise
The reflection asks me
“Who are you?”

I see masked faces
With glazing eyes
They ask
“Aren’t you me?”

I see
Hands dusting
Worn out pages
Imprinted with uncanny memories
They fall down and turn to ashes

I see
I become the refugee
And the savior
I am my hideout

I see
All the springs
Sprinkled age on me
They leave

I see
The catastrophe
The scorching hug of time
I arouse
I burn

My mirror invites me
In to it
I go with all my heart
Unlocking every reflection of mine

**Times**

Those moments roll on
Leaving behind the miniature frames
Of the bygones
Dusted foot prints
Parroting baby cries
Matured walks of bruised feet
Whispered talks and voiced triumphs

They roll on

We crave for the lost
Still they roll on
On the very burials of hopes
Resting for peace

Emptiness is the key
For it is the rebirth
And the moments roll on
As if there is nothing to take forth
But why???

Wednesday, November 19, 2014

వెలుగూ చీకటీ

ఇన్ యాంగ్ అంటే స్థూలంగా చీకటి వెలుగుల సమతుల్య సంగమం అని చెప్పవచ్చు. 
చీకటి వెలుగూ స్త్రీ పురుషులిద్దరిలో ఉంటాయి. 
ఒకరి వెలుగులో ఒకరు నిండిపోవడం ఒకరి చీకటిలో ఒకరు సేద తీరడం జీవన సూత్రం. 
అదే హిందూ జీవన విధానంలో అర్ధనారీశ్వర తత్వంగా చెప్పబడింది. 
ఇవన్నీ పరస్పర ప్రేమను దంపతుల మధ్య బాంధవ్యం ఉండవలసిన తీరునూ అంతర్లీనంగా బోధిస్తూ ఉంటాయి. 
ఇవన్నీ ప్రపంచం పుట్టినప్పటినుంచీ ఉన్నవే. 
తెలుసుకున్నవారికి తెలుసుకున్నంత. 
ఏదో వెతుకుతూ ఎక్కడికో వెళ్ళకండి. అన్నీ మీ చుట్టూనే ఉంటాయి. మామూలు కళ్ళతో కాకుండా అంతర్నేత్రంతో చూడటం ఎలాగో మాత్రమే మనం తెలుసుకోవలసింది. 

- స్వామి లౌకికానంద

Saturday, September 6, 2014

**షాపింగ్**

ఆకాశం నిండా నల్లమబ్బులు
మనసుకూడా ముసురేసింది
ఏమీ తోచక బ్లాక్ సిగరెట్టొకటేసుకుని
దారి వెంబడి నడక

కాళ్ళకు బురద అంటకుండా చెప్పులడ్డు
చెప్పాలంటే నవ్వొస్తోంది గానీ
సిగరెట్టు తడవకుండా గొడుగడ్డు

ఏమీ లేని దారిలో ఒకటే షాపు
పేరు టైమ్ షాపీ
జ్ఞాపకాలమ్మబడును అని ఒక సైన్ బోర్డు

వస్తువు వాడిన తరువాత చెల్లించవచ్చట
ధర వజ్రపుతునకల్లా జారే రెండు కన్నీటి చుక్కలు

చేసేదేమీ లేదు
కళ్ళజోడు సవరించుకుని లోపలికెళ్లడమే

Friday, September 5, 2014

**The silent intruder**

She enters in
Like a butterfly
Soft and silent

No squeaking of doors
No chimes ringing
No sound of footsteps
No swoosh of flapping wings

She whispers
The words I can understand
But cannot remember

She stands before me
Spilling all the colours
Blinding my eyes

She sheds her cover
She wears me
Together we fly
And we land nowhere

Wednesday, August 27, 2014

**ఏమంటానూ?**

అంతే తెలియని చీకటి మహా సముద్రంలో
ఎప్పుడో ఒకప్పుడు ఆరిపోయే
వెలుగు దీవుల్లో నివసిస్తున్నామంటాను

చీకటి వెలుగూ ఎప్పుడూ పోట్లాడుకోవు
కలిసిపోనూ పోవు
అయినా చీకటి కలిసిన వెలుగూ
వెలుగు కలిసిన చీకటీ ఎలా ఉంటుందో చెప్పమంటే
అరమూసిన కళ్ళను చూపించడమో
అరచేతులతో కళ్ళను మూసి కొంత సందు వదలడమో
ఏమో మరి ఎలా చెప్పాలో ఎవరికీ తెలీదంటాను

నవ్వొస్తుంది ఒక్కోసారి
రాత్రంతా ఏలిన చీకటిని పొద్దుటి వెలుగు తరుముతుంది
మూడు పొద్దుల వెలుగూ రాత్రికి సర్దుకుంటుంది
ఒకటి పోతే ఇంకొకటి కానీ రెండూ కలిసి రావే

అసలేమిటీ మెట్ట వాగుడు అంటే
ఏమంటానూ?

ఏమో తెలీదంటాను

Thursday, August 21, 2014

**శృంగారాలు – 8**

నీ పల్చటి పెదవులకంటిన
ఊదా రంగు వెన్నెల
నా చెవులను అనుక్షణమూ ముద్దాడుతూనే ఉంటుంది

నీ కళ్ల కదలికలతో
నా కళ్ళు ఎప్పుడూ లయిస్తూనే ఉంటాయి

నీ ఉచ్ఛ్వాస నిశ్వాసల్లోని వింత పరిమళం
నన్ను అంటిపెట్టుకునే ఉంటుంది

నువ్వూ నేనూ సుఖించాలంటే
పిల్లా
శరీరాలే కావాలా
మాటలు చాలవూ

Wednesday, August 20, 2014

**చిత్రం**

రాత్రికి రాత్రి మొదలై
ఉదయం పలకరిస్తే మొగ్గ పుష్పమయ్యే
విస్ఫోటన విన్యాసాన్ని
దగ్గరగా మెల్లగా తరచి చూడాలనిపిస్తుంది

ఆ పూసిన పుష్పాలకు 
అత్తరు ఎవరద్దుతారో
ఎలా అద్దుతారో
అసలెప్పుడు అద్దుతారో

ఇంత జరిగినా ఏమీ తెలీనట్టు
గుంభనంగా నవ్వే పువ్వుల గుంపులు
పిలుస్తున్నట్టు అర్థమవుతుంది
వెళ్ళి వాటితో కలిసి ఊగి తూగే వీలు లేదనీ తెలుస్తుంది

పువ్వులు పూయడమొక చిత్రమయితే
వాటిలో వాటితో నేను కలిసిపోలేకపోవడం
చిత్రాతి చిత్రం

వాటిని అనుకరిస్తూ నవ్వడానికి ప్రయత్నించగలనంతే

Friday, August 15, 2014

**చీకటి కబురు**

రాత్రుళ్ళన్నీ నావే
ఆ రాత్రులు కురిపించే చీకట్లన్నీ నావే
ఆ చీకట్లు చెమరించే ప్రేమంతా నాదే
ఆ ప్రేమలో పండే బ్రతుకంతా నాదే

చీకటంటే తల్లి గర్భం
చీకటంటే చెలి ఒడి
చీకటంటే హృదయాంతరాళం
చీకటంటే నీలో నువ్వు

Sunday, May 25, 2014

**పసిడి పిల్ల**

పరవళ్ళు తొక్కేటి పసిడి నవ్వుల్లోన
తళుకులీనే చిలిపి భావమేమో

ముక్కెరంతా మలిగి
చిరు చెంద్రమై వెలిగి
దీపాల మించు వెన్నెలెమో

కళ్ళలో దూకేటి జలపాతమే అది
అమృతం కురిసేటి వర్షమేమో

పలికేటి గొంతులో
ఎన్నెన్ని వైనాలు
ఎంచుకుంటే బతుకు చాలదేమో

నడకల్లో నాట్యాలు
మోగేటి మువ్వల్లు
అవి ఆగితే గుండె ఆడదేమో

ఎన్నెన్ని అందాలు
పూస్తాయి పూలు
ఈ పిల్ల మేనికి సాటిరావేమో

దేవతో ఏమో ఈ పిల్ల
దేవతో ఏమో

Friday, April 18, 2014

**పనికొచ్చేది**

హోమగుండంలో పూర్ణాహుతైన
గుమ్మడికాయలాంటి
మెత్తటి రాత్రి

ఒకరివెంట ఒకరు
ఊరికే పరుగెత్తే
పిచ్చికుంకల్లాంటి గడియారపు ముళ్ళు

ఆ కాసేపటికీ హస్తభూషణమయ్యే
పెద్ద కప్పులోని టీ అంటే
నాకన్నా వాటికే ఇష్టం

కప్పును పట్టుకునే చేతి వేళ్ళనూ
తాకీ తాకనట్టు తాకే పెదాలనూ
చప్పరించే నాలుకనూ చూస్తూ
కప్పులోని టీ అయిపోయేంతవరకూ
రాత్రి
గడియారం
అలానే నిల్చుండిపోతాయి

అలా రాత్రిని కాలాన్ని నిలబెట్టే టీ కోసం
స్టవ్ రోజూ ఎదురుచూస్తుంది

ఒక్కో తేనీటి చుక్క
గొంతుదిగే ఒకానొక జ్ఞాపకం
నిజంగా జీవితంలోకి వెళ్లాలనుకున్నపుడు పనికొస్తుంది

Monday, March 3, 2014

**The Shores**


Innumerable shores meet
At a cape where all the oceans rest 
Where all the conchs
Exchange their honks 
Where all the sea shells 
Share their sheen

And the sands
Whisper off their romance 
And let the sun shine 
To lit up the evenings 
And the moon seeps in to the water
To burn it quiet and cool

At last the shores depart 
Leaving behind the trails of scorching love 
Filled in the scratches of nails

Wednesday, February 26, 2014

**పిచ్ బ్లాక్**

అన్నీ రంగులూ కలిస్తే తెలుపు కదా 
ఏ రంగు లేకపోవడమే నల్లదనమా
ఏమో
నల్లదనానికి కూడా కొలతలుంటాయి 
కలర్ టెక్నాలజీ మహిమ

మరి కమ్ముకునే నల్లదనాన్ని ఎలా కొలవాలో 

పిచ్ బ్లాక్? 
కమ్ముకొచ్చే ప్రశ్నా?
సమాధానమా? 
ఏదైనా స్పెక్ట్రోస్కోప్ 
కొలుస్తూ కనబడితే అడగాలీసారి

నా పిచ్చిగానీ 

గట్టిగా మూసుకున్న రెప్పల వెనుక 
నేనెప్పుడూ గమనించే చీకటినే అడగవచ్చుగా
వెంటనే ఆ పని చెయ్యాలి

చీకటిలో ఏవో ఆకారాలు 

రూపాలు మారుతూ కదలాడుతున్నాయి 
విరగ పూచిన శాంతి 
నల్లటి రెక్కలై రాలిపోతోంది 
నా భుజాలను ఒరుసుకుంటూ 
కొన్ని ముక్కలు నా ఒళ్ళో పడుతున్నాయి
ఓం శాంతిః శాంతిః శాంతిః

అంతలో కొన్ని మాటలు

అమ్మా పువ్వులన్నీ నల్లగా మారి రాలిపోతున్నాయి 

ఏం కాదులే తల్లీ మళ్ళీ పూస్తాయి 
రంగుల్లో పూస్తాయా అమ్మా 
అవును చిట్టి తల్లీ రంగుల్లోనే పూస్తాయి

Monday, February 17, 2014

**పేరున్నా లేనిది**

ఎప్పుడో కదలాడిన ఒక తెమ్మెర 
మళ్ళీ ఒకసారి
చేరుకోలేని తెరై తగులుతుంది 
ఏమడగను
ఏం మాట్లాడను

చూస్తూనే ఉండాలనిపిస్తూనే

ఇక చూడకూడదనిపించే స్థితి 
ఎలా ఉంటుందో నీకు తెలుసా 

ఒకసారి నింపేసుకున్న హృదయం

ఎంత తోడినా ఖాళీ అవదని తెలిసినా
ఏతాం వెయ్యడానికే సరిపోదనిపించే బ్రతుకును
ఎప్పుడైనా బ్రతికావా

ఎప్పుడు ఎలా పుడుతుందో తెలియనిది 

పోయినదేదీ దొరకదెందుకని తొందరగా

Wednesday, February 12, 2014

**శృంగారాలు – 7**

ఈ భూమిమీద పూసేముందే
కట్టగట్టుకుని మాట్లాడుకుంటాయేమో 
కనకాంబరాలు
వాడిపోయినా వన్నె తగ్గకూడదని

మనంకూడా మాట్లాడుకుందాం

పెదాలతో
చేతులతో కాళ్లతో
శరీరాలతో
ఇవన్నీ కుదరకపోతే 
కనీసం కళ్ళతో

అలవిగాని కోరికతో

ప్రేమతో ద్వేషంతో అసూయతో
ఇంకేదైనా భావంతో
ఏదీ చొరబడని దగ్గరితనంతో
కనీసం మౌనంగానైనా
మాట్లాడుకుందాం

పిల్లా

మనం కనకాంబరాలం
వయసు వాడినా
మనసు వన్నె తగ్గదులే

Thursday, February 6, 2014

**ఊరు**

కాస్త పచ్చదనం కనిపించినా 
పారే నది కనిపించినా
గుబురు పొదలపై 
గుత్తులుగా పూసిన పూలు కనిపించినా 
కాస్త వెన్నెల ఎప్పుడైనా తడిమినా 

కొంచెం చల్లని గాలి
ఎప్పుడైనా గుసగుసలాడినా 
మెత్తటి తడి మట్టి ఎప్పుడైనా 
పాదాలను ముద్దు పెట్టుకున్నా 
గుడి గంటలు లీలగా వినిపించినా 
ఆకాశం నిండా చుక్కలు చూసి 
చాలాకాలమైందనిపించినా 
గుంపులు గుంపులుగా ఎగురుతున్న
పిట్టలు కనిపించినా
ఎవరి మాటల్లోనైనా 
కాస్తంత మొరటుతనం
మంచితనం కనిపించినా 


నీకు తెలీకుండా

నీ కంట్లో ఉబికిన తడి 
నీ చెంపలను తడిపితే 
నీలో నీ ఊరు
ఇంకా సజీవంగానే ఉన్నట్టు

Tuesday, January 28, 2014

**శృంగారాలు – 6**

శరీరాలకు ఆకలెక్కువ 
నేను నిన్ను నువ్వు నన్ను 
కలిసిన ప్రతిసారీ 
మన ప్రమేయం లేకుండానే 
శరీరాలు వాటి ఆకలినవి తీర్చేసుకుంటాయి
మొహమాటాలే లేకుండా

నీలో నేను నాలో నువ్వు మాత్రం 

ఇదేదీ పట్టనట్టు
ఒకరి కళ్లలోకి ఒకరు 
చూస్తూ కూర్చుంటాం

ఒళ్ళు పొంగి కందిన గాయాలూ 

మనసులు తడిసిన సమయాలూ 
మిగిలిపోతాయి

Saturday, January 18, 2014

**The Balcony**

Sometimes at nights
I just go in to my balcony
Where I feel the quieten
And talk to myself

Moonlight spills out of my balcony
It drowns me in to a lone path
It draws me on to a palanquin
This takes me to the world so far in me
Guised under a canopy of withered fabric

I clean the mess
I wash it with my bare hands
Then the moonlight spills there too
I am the moon
Then the whole world talks in to me