Right disabled

Wednesday, October 5, 2016

**స్వగతం**

ప్రపంచపు ఏడు వింతలు తెలుసా నీకు
అవన్నీ ఎవరో ఒకరు ఏర్పరచినవే కదా
ముద్రలు గల ఐదు వేళ్ళు, రేఖలు గల అరచేతులే కదా
అవన్నిటినీ కట్టింది

ఒరేయ్ 
కట్టినవే వింతలైనపుడు
కట్టిన చేతులు ఎంత వింతలో కదా
ఆ కట్టిన చేతుల వెనుక ఉన్న ఆలోచన 
అంతకన్నా వింతకదా
ఆ ఆలోచన వెనకున్న ఊహ
అబ్బా ఎంతటి వింత

రోజూ చాలా వింతలు జరుగుతాయి
నీకు తెలుసా
గమనించావా 
రోజూ చూసేవి ఎంత వింతలైనా
అలా అనిపించదు కదూ

సూర్యోదయమొక వింత
చంద్రోదయమొక వింత
పగలొక వింత రాత్రొక వింత
ఆలోచనొక వింత ఊహొక వింత

ప్రేమ పుట్టడం అది పరిపక్వమవ్వడం వింతలు కావూ
ఎలా జరుగుతాయో తెలిసినా వాటి వెనుక ఉన్న ప్రేరణ వింత కాదూ

నీ నడకొక వింత నడతొక వింత
నవ్వొక వింత ఏడుపొక వింత
నీ నిండా వింత 
ఏకంగా నువ్వొక వింత

అన్నిటినీ దర్శించగలగడం వింతను మించిన వింత
నాకు నేను చెప్పుకోవడం కూడా 

నాలో ఇంకో రెండోవాడు కదా అసలు వింత
వాడు నేను చెప్పింది అపురూపంగా వింటాడు

No comments:

Post a Comment