Right disabled

Sunday, May 24, 2020

**The betrayal**

బాగుంది

చాలా బాగుంది

 

You are the one who gave me the word

 

కంటికి కనబడుతూ కూడా

కటిక మోసం ఎలా చేయాలో

నిన్ను చూసే తెలుసుకోవాలి మరి

 

You know you are an illusion

You know you are just an imaginary colour

 

అయినా సాహసిస్తావ్ కదూ

అసలు లేని నీకు కళ్ళెక్కడివి

 

ప్రేమ అనే పదం లాగే

నువ్వు కూడా భావార్థమేనా

 

You said you love me

But you never let me touch you

 

నువ్వు లేవని నాకు తెలిసిపోతుందని కాదూ

రంగులు మార్చే నీకు ఇందెంత పనిలే

 

కళ్ళు తిరిగేంత పసినీలంగా కనిపించినా

కెంజాయ వర్ణంలో

I am in the mood for mornings and evenings

అని కవ్వించినా

 

With full of pregnant clouds

నా జాలిని కొలవాలని చూసినా

నేను కరగను

 

My colour is of fine whiskey

 

వయసు తెలియని నువ్వు

ఎప్పటికీ ఒకలాగే కనిపిస్తావేమో

 

But I age gracefully

I swear on the decanter

And those shiny crystal glasses

Happily clinging

Full of elixir of intoxication

 

నువ్వు పేరుకే ఆకాశానివి

నేను నిన్ను మించి ఎగురుతాను

 

నువ్వు లేనేలేవని నా ప్రగాఢ నమ్మకం

 

Mark my words

 

భోరున కురిసి

తెరిపి ఇచ్చినా

ఆ తెల్లటి కాంతికి నేను తొణకను

 

I am as petrified as glass

**Is that it?**

వర్షం కురిస్తే

ఓ వర్షం కురిస్తే

 

నది అద్దంలా పారుతుంది

లోతుగా పారుతుంది

 

నా ముఖం స్పష్టంగా కనబడేంత మంద్రంగా పారుతుంది

నాలోకి చూసుకుంటే నేను భయపడేంత

లోతుగా పారుతుంది

 

ఒక ఫారో దీవుల పిల్ల పాడితే

గోల్డెన్ స్పారో బాటిల్ వగరులో ఆస్వాదిస్తాను

 

పొగరు కదూ నీకు

 

you might not know

you are full of arrogance

 

ఏమీ పట్టనట్టు కురుస్తావు కదూ

ఎవరేమైపోతున్నా

ఎవరెలా ఉన్నా

 

I don’t want to fight you

 

దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటే

చలనం లేకుండా అది ఉన్నట్టా

పట్టించుకోకుండా నువ్వు కురిసినట్టా

 

But you do it

 

అద్దాల మాటున నిన్ను చూసినా సరే

తెలియని రంగులన్నీ వెలిసిపోయేలా కురుస్తావు

 

I hate you for that

And you always knew

 

తెలియకుండానే కురిసి పోయినట్టు

 

I cannot handle the heat when you rain

Inside

 

నువ్వన్నా ఆగిపో

నన్నన్నా ఆపేయ్

 

అన్నిటికన్నా ముందు

తెరిచిన ఇటాలియన్ బాటిల్ ను

ఒంటరిగా వదిలెయ్యడం నాకసలు ఇష్టం లేదు

కనీసం నేను

ఖాళీ అయ్యేదాకా ఉంటాను

 

And I know

It happens over and over


Sunday, April 26, 2020

** the primal instinct**

ఇప్పటి నేను 
ఇప్పటి నేను కాను

సాలీడు అల్లుకున్నట్టుగా 
గిజిగాడు కట్టుకున్నట్టుగా 

నన్ను నేను
కొంత తెలిసీ 
చాలా తెలియక 

నాకు నేనే
పదిలంగా కూర్చుకున్న
ఒక మందసాన్ని

నాకు నేను 
ఊపిరులూదుకున్నది
ఈ ఒంటరితనంలోనే

నాలో నేను 
జీవించి ఉన్నది 
అది తెలుసుకున్నది కూడా
ఈ ఒంటరితనంలోనే 

వర్తమానం నుంచీ వెనక్కి వెళుతూ
ఉన్న అక్షరాలను దులిపేసి 
పేజీలను ఖాళీ చేసుకుంటూ 

రాలి పడిన ఆకులను 
మళ్ళీ రెమ్మలకు అతికిస్తూ

పువ్వులను మొగ్గల్లోకి దించి 
విశ్రమిస్తూ 

మూలాలలోకి 
మూలాల మూలాల్లోకి

వెతుకుతూ వెతుకుతూ 
ఏం వెతుకుతున్నానో తెలియనంత 
చీకటి అగాధాల్లోకి 
నన్ను నేను తోసుకుంటూ అల్లుకున్న
నా నేను

అంతా ఈ ఒంటరితనంలోనే 

జవాబు లేనప్పుడు దాన్ని ప్రశ్న అంటారా?
తెలియడంలేదే 
మరి ఇది శేష ప్రశ్నా?

ఇలా జాగ్రత్తగా
ఆలోచనపై ఆలోచన పేర్చి కట్టుకున్న 
నేను 
ఎప్పటి వాడనో తెలియదు కానీ

నా ఆనందం నా ఒంటరితనం
నా ఒంటరితనం కన్నా గొప్పదానివైనపుడు 
నువు నా దానివి

Monday, February 10, 2020

**కాలం లేనిది**

నేను తనని ప్రేమిస్తానంతే 
తను నన్ను గొప్పగా ప్రేమిస్తుంది

వత్తిని మలిగించే చిన్న మంటలా 
వెచ్చనైన ప్రశాంతతతో 
నన్ను ఇష్టపడుతుంది

నేను హృదయంతో మాత్రమే ప్రేమిస్తానేమో

చల్లటి గాలి వీచినంత స్వేచ్ఛగా
గువ్వలు కూసినంత మంద్రంగా
మంచు పరుచుకున్నంత నిశ్శబ్దంగా 
మసక వెన్నెలంత దట్టంగా
మొలక పెరిగినంత ప్రాణంగా
సముద్రమంత కల్లోలంగా  

కాలంతో పాటు ప్రయాణించినంత వేగంగా

ఇంకా చాలా రకాలుగా ప్రేమిస్తుంది

ఒక్కోసారి అంత గాఢత అర్థం కాదు కూడా

నన్ను ఈ ప్రపంచానికి కట్టి ఉంచే 
ఆకర్షణ శక్తి తను

తన ప్రేమకు కాలనియమం లేదు

అదొక జీవధార
తనొక ప్రణయమూర్తి 

Monday, January 20, 2020

**ఎవరీవు**

ఈ కాలాంతర
మృత శకలానికి 
గులాబీ ముద్దులద్ది
మేల్కొల్పిన నీవెవరు

ఈ యుగాంతర 
శిలాజాన్ని
శుభ్రం చేసి సానపట్టి
అందంగా పేరు చెక్కిన చేతులెవరివి

ఆరిపోయిన కణాలలో 
జీవములూది
పచ్చటి మొలకలు 
మెరిపించిన ప్రాణమెవరిది

జ్వలించి జ్వలించీ
రాలిన బూడిదను 
నక్షత్రధూళిగా మలిపి
గుండెను మళ్ళీ చేసిన మనసెవరిది

నువ్వే కదూ

చెవులలో ముసిముసిగా నవ్వి
వేళ్ళకు స్పర్శను పరిచయం చేసి 

ఆకలిని చల్లర్చింది
ఏడుపును పొంగనిచ్చింది
బతుకును తీర్చింది

నీ సమక్షం కదా శాశ్వతం