Right disabled

Monday, May 25, 2020

**the imp**

చెక్కిన శిల్పంలా

గీసిన బొమ్మలా

 

చక్కగా

అలా చక్కగా

 

కుదిరినట్టు పడుకోవడమెలాగో

నీకు మాత్రమే తెలుసనిపిస్తుంది

 

You sleep like a baby

On the bed forged from my heart

మైమరిచిపోవడం మొత్తంగా తెలిసింది ఇక్కడే

పడగ్గది అంటే నాకు ఎందుకు ఇష్టమో తెలుసా

నీవక్కడ క్షణాలు యుగాలుగా ముద్దులొలికే నిద్రపోతావు

 

All the opened books look at you

Like the fables in them

Deceitful yet wonderful

 

నటిస్తున్నంత సహజమది

నమ్మలేను

 

ఒక బొమ్మలా

ఒక రాత్రిలా

ఒక పాత అలమారాలా

పాత చెక్క పెట్టెలా

ఊరిబయట బోదకప్పు గుడిసెలా

రాలిపడిన తురాయి పువ్వులా

మొగ్గలా

పువ్వులా

దానినంటుకున్న పుప్పొడిలా

 

నువ్వక్కడ నిద్రపోతావు

మంచం నీ నిద్రతోపాటు ఓలలాడుతూ ఉంటుంది

 

My rocking chair resonates with your sleepy breath

I reconcile with your sleep with my eyes wide open

  

నీలో

నీ తలపుతో

శాశ్వతంగా నిద్రపోయే వరకూ

నేను మెలకువతోనే ఉంటానేమో

 

నీ నిద్రను ఆస్వాదిస్తూ

 

I sing along with your patterns

**The signature**

అప్పుడు

ఆ రాత్రి

 

ఒక సంతకం

చాలా మత్తైన సంతకం

 

నువ్వు నా శరీరమంతటా చేసిన

అత్యంత సుఖకరమైన సంతకం

 

You know, that was my first time

To be signed off by someone wonderful like you

 

ఎంతమంది మందాకినిలు

ఎన్ని మధుపాత్రలు ఒంపినా

 

ఎంతమంది మోహినులు

ఎన్ని అమృతపు భాండాలు ఒలికించినా

 

నా గొంతుక తడిసింది

నీ నామస్మరణతో

 

I just chanted your enchanted name

I just lost myself into your electric sheen

 

రాసుకుందామనుకుని

చాలా సార్లు తలపులు మూసుకున్న రాత్రుళ్ళు

అలా కలత నిద్రతో గడిపిన వాడిని

 

Nobody teaches me intoxication

 

నేనొక పండితుడిని

నీ ప్రేమలో పండిన ఒక అసామాన్య నరుణ్ణి

 

Your love is an age-old bottle of wine

Your grace falls upon me like a canopy made of wild silk

 

కోల్పోవడం అంటే తెలిసింది ఆ మత్తులో

జ్ఞానంతర మోక్ష మార్గదార్శనికవు

 

Let me get lost in you

Let me salvage my age with you

 

నువ్వొక యుగాంతర మృత్తికా మధుపాత్రవు

నీ యందు ప్రవహించునది మత్తెక్కించు మధురాత్రము

 

You are a night of eclectic ecstasy


Sunday, May 24, 2020

**The betrayal**

బాగుంది

చాలా బాగుంది

 

You are the one who gave me the word

 

కంటికి కనబడుతూ కూడా

కటిక మోసం ఎలా చేయాలో

నిన్ను చూసే తెలుసుకోవాలి మరి

 

You know you are an illusion

You know you are just an imaginary colour

 

అయినా సాహసిస్తావ్ కదూ

అసలు లేని నీకు కళ్ళెక్కడివి

 

ప్రేమ అనే పదం లాగే

నువ్వు కూడా భావార్థమేనా

 

You said you love me

But you never let me touch you

 

నువ్వు లేవని నాకు తెలిసిపోతుందని కాదూ

రంగులు మార్చే నీకు ఇందెంత పనిలే

 

కళ్ళు తిరిగేంత పసినీలంగా కనిపించినా

కెంజాయ వర్ణంలో

I am in the mood for mornings and evenings

అని కవ్వించినా

 

With full of pregnant clouds

నా జాలిని కొలవాలని చూసినా

నేను కరగను

 

My colour is of fine whiskey

 

వయసు తెలియని నువ్వు

ఎప్పటికీ ఒకలాగే కనిపిస్తావేమో

 

But I age gracefully

I swear on the decanter

And those shiny crystal glasses

Happily clinging

Full of elixir of intoxication

 

నువ్వు పేరుకే ఆకాశానివి

నేను నిన్ను మించి ఎగురుతాను

 

నువ్వు లేనేలేవని నా ప్రగాఢ నమ్మకం

 

Mark my words

 

భోరున కురిసి

తెరిపి ఇచ్చినా

ఆ తెల్లటి కాంతికి నేను తొణకను

 

I am as petrified as glass

**Is that it?**

వర్షం కురిస్తే

ఓ వర్షం కురిస్తే

 

నది అద్దంలా పారుతుంది

లోతుగా పారుతుంది

 

నా ముఖం స్పష్టంగా కనబడేంత మంద్రంగా పారుతుంది

నాలోకి చూసుకుంటే నేను భయపడేంత

లోతుగా పారుతుంది

 

ఒక ఫారో దీవుల పిల్ల పాడితే

గోల్డెన్ స్పారో బాటిల్ వగరులో ఆస్వాదిస్తాను

 

పొగరు కదూ నీకు

 

you might not know

you are full of arrogance

 

ఏమీ పట్టనట్టు కురుస్తావు కదూ

ఎవరేమైపోతున్నా

ఎవరెలా ఉన్నా

 

I don’t want to fight you

 

దున్నపోతు మీద వాన కురిసినట్టు అంటే

చలనం లేకుండా అది ఉన్నట్టా

పట్టించుకోకుండా నువ్వు కురిసినట్టా

 

But you do it

 

అద్దాల మాటున నిన్ను చూసినా సరే

తెలియని రంగులన్నీ వెలిసిపోయేలా కురుస్తావు

 

I hate you for that

And you always knew

 

తెలియకుండానే కురిసి పోయినట్టు

 

I cannot handle the heat when you rain

Inside

 

నువ్వన్నా ఆగిపో

నన్నన్నా ఆపేయ్

 

అన్నిటికన్నా ముందు

తెరిచిన ఇటాలియన్ బాటిల్ ను

ఒంటరిగా వదిలెయ్యడం నాకసలు ఇష్టం లేదు

కనీసం నేను

ఖాళీ అయ్యేదాకా ఉంటాను

 

And I know

It happens over and over


Sunday, April 26, 2020

** the primal instinct**

ఇప్పటి నేను 
ఇప్పటి నేను కాను

సాలీడు అల్లుకున్నట్టుగా 
గిజిగాడు కట్టుకున్నట్టుగా 

నన్ను నేను
కొంత తెలిసీ 
చాలా తెలియక 

నాకు నేనే
పదిలంగా కూర్చుకున్న
ఒక మందసాన్ని

నాకు నేను 
ఊపిరులూదుకున్నది
ఈ ఒంటరితనంలోనే

నాలో నేను 
జీవించి ఉన్నది 
అది తెలుసుకున్నది కూడా
ఈ ఒంటరితనంలోనే 

వర్తమానం నుంచీ వెనక్కి వెళుతూ
ఉన్న అక్షరాలను దులిపేసి 
పేజీలను ఖాళీ చేసుకుంటూ 

రాలి పడిన ఆకులను 
మళ్ళీ రెమ్మలకు అతికిస్తూ

పువ్వులను మొగ్గల్లోకి దించి 
విశ్రమిస్తూ 

మూలాలలోకి 
మూలాల మూలాల్లోకి

వెతుకుతూ వెతుకుతూ 
ఏం వెతుకుతున్నానో తెలియనంత 
చీకటి అగాధాల్లోకి 
నన్ను నేను తోసుకుంటూ అల్లుకున్న
నా నేను

అంతా ఈ ఒంటరితనంలోనే 

జవాబు లేనప్పుడు దాన్ని ప్రశ్న అంటారా?
తెలియడంలేదే 
మరి ఇది శేష ప్రశ్నా?

ఇలా జాగ్రత్తగా
ఆలోచనపై ఆలోచన పేర్చి కట్టుకున్న 
నేను 
ఎప్పటి వాడనో తెలియదు కానీ

నా ఆనందం నా ఒంటరితనం
నా ఒంటరితనం కన్నా గొప్పదానివైనపుడు 
నువు నా దానివి