Right disabled

Saturday, March 24, 2018

**దేవీ మౌనమా**

ఏం
నువ్వు నాతో మాట్లాడకపోతే
ఇంకేవీ మాట్లాడవా
గాలి మాట్లాడదా
నీరు మాట్లాడదా

నేను నిన్ను చూడటానికి 
రోజూ నడిచే దారి మాట్లాడదా

నిన్ను తలుచుకుంటూ
నువ్వు పక్కనే ఉన్నావనుకుంటూ 
చాయ్ తాగడానికి
నేను పట్టుకునే కప్పు మాట్లాడదా

నేను పెట్టిన మెస్సెజ్ కు 
రిప్లయ్ కోసం ఎదురుచూసే 
చూపు మాట్లాడదా

ఇంతకు ముందెప్పుడో చెప్పినట్టు
ఫోన్ అవతలినుండి గంట కొట్టినట్టు
టింగు మని వినబడే గొంతును విన్న 
జ్ఞాపకాలు మాట్లాడవా

ఒక్క నిముషం
రెండు నిముషాలు
మూడు నిముషాలు 
దాటాక గానీ నాకు అర్థమవదు

నువ్వు మాట్లాడితేనే అన్నీ మాట్లాడతాయి
లేకపోతే లేదు

దేవీ.... మౌనమా.... 

No comments:

Post a Comment