Right disabled

Thursday, November 12, 2020

**the longing**

నాదొక గడ్డిపువ్వు లాంటి జీవితమని

వేరెక్కడికీ వెళ్ళకుండా

ఆ గడ్డి మొక్కకే

ఒకటి తరువాత ఒకటిగా

నేనే గడ్డిపూలై పూస్తుంటానని


ఎలా చెప్పను


I can never know

How I bloom and

How I fall back into your invisible fold


మానస మందార తోటల్లో

సృష్టి రహస్యానివై సంచరించిన దానవు

మేఘాల పరుపులపై విశ్రమించి

శూన్యపు అంచులను మీటుతూ

ఆదినాదాన్ని సృజియించిన దానవు


That primordial sound resonates

It cleanses my senses

And I can’t see you

I question myself, why


ధూళికాధూమ్రపాలినివి

గడ్డిపూల పుప్పొడి నీకేపాటి


శబ్దమై విస్తరించే నీకు

ఈ గడ్డి పువ్వు గాలికి కదిలిన సవ్వడేపాటి


సర్వప్రాణ సంస్థితవైన నీకు

ఈ చిన్న ప్రాణమేపాటి


All I asked for is a bunch of moments

Moments of life

Moments of deep and sacred union

I need nothing more


నీ ఆలోచనను మోస్తూ బ్రతకనీ

నీ ఆలోచనతోనే నన్ను అంతమైపోనీ


I longed for this

1 comment: