Right disabled

Friday, September 3, 2021

**the altered consciousness**

 Who are you?


ఈ ప్రశ్న వేయడానికి ఆలోచన ఎక్కడిదో మరి


చలనం లేని కొలనులో

ఆకాశాన్ని, నక్షత్రాలను,

నన్ను నేను చూసుకున్నంతగా

నిన్నెప్పుడు చూస్తానా అని


Every time I feel you

It alters my consciousness


భూమి శరీరాలను కలిపేసుకున్నంత లాఘవంగా


అంతటా ఆవరించిన మానసికావరణం

అంతర్లీన తరంగవేగం

అదొక జాల ప్రకృతి


అది నువ్వేనా?


Endless transformation

Beyond meaning and reason

It is you

And only you


రూపాంతర మోహావేశ ముగ్ధకాంతా

అరూపలావణ్య అంతర్నిహితా


The way you transcend

Inspires me to mingle

We are not meant to unite

For we are inseparable


కిటికీలోంచి చూస్తుండగా

వెనక్కి తరలి వెళ్ళిపోయిన కాలాలను వదిలేసి

మిగిలిన నన్ను మాత్రం నీకిచ్చుకోను

నేనంతా నీకే


అంతా చూస్తూ మైమరపు నాది

అంతటా ఉంటూ పై మెరుపు నీది

Sunday, March 21, 2021

**the vogue**

I didn’t get the taste of it

Until you made me into a mural

 

To be mute artistically

Yet colorful


మౌనాకార శిల్పాలను చెక్కగలదానివి

వాటికి మాటలు పోయగలదానివి


O my dear ancient poetess

Your very existence is a myth

You are nothing but an image

Prevailing over the universe


అనుభవించబడలేని దానివి

ఆక్రమణ మాత్రమే తెలిసిన దానివి


నీకో రోజంటూ ఉంటుందా

నీకో ప్రపంచమంటూ చాలునా


నీ ఆలోచన పరుచుకున్నంత సేపూ

జీవధూళి రాలుతూ ఉంటుంది

మట్టి గట్టిదైనా మొలకలు పల్చన


వచ్చేది నీనుంచే చేరేది నీ చెంతకే


నిన్నెవరూ ఇముడ్చుకోలేరు

నిన్ను నువ్వు ప్రతిసారీ ప్రకటించుకుంటావంతే


I got the glimpse of you inside me

And you took me in


O my dear poetess

I am your poem

Tuesday, February 9, 2021

**the prelude**

 ప్రవహించిన కాలపు క్షణాలు వాడని పువ్వులు

మాలగా గుచ్చడం ఒక అలవాటు

చివరికి అలంకరించుకోకుండా వెళ్ళిపోవడం

ఇదే జీవితం అనిపిస్తుంది ప్రతిసారీ

 

as that very day arrives

all the cuckoos sing

waving their tails

all they ask is to have a look

at all the walks

descended into time

 

this is the prelude

 

my dear long-time friend

for the day that is coming

 

అలా మిగిలిపోయిన ఎన్నో మాలలు

ఏ గుర్తూ వదలాలని ఉండదు

అల్పసంతోషిత్వాల్ని నేర్పుగా వదులుకోవడమే

మరపును చేరదీయడం ఒక తపస్సు

 

O! dear!

 

I stopped looking for gifts

I closed doors for sweet musicals

As the silence spreads like evening darkness

I let the rejoicing happen

No embellishments

No ecstasy

 

Nothingness is the virtue

 

ఒక్కొక్క సంవత్సరమూ ఒక్కొక్క నిప్పు

కొద్ది కొద్దిగా కాలుతుంది సరం

అందమైనదో కాదో తెలియని అనంతానికి దారి ఇది

 

ఒక తోడు

ఒక గొప్ప కాఫీ

కొన్ని పుస్తకాలు

ఒక మెత్తటి కుర్చీ

ఒక దట్టమైన నిర్లిప్తత

 

This is a birthday song

Monday, January 25, 2021

**that inevitable you**

I wonder what you are

not like in that kids' poem

you push yourself to the shore
with those soft fingers of the sea
you touch me with vigor

నీ నుంచీ నాకేమీ వద్దు నువ్వు తప్ప
అంటూ సాంతం ఆక్రమించేసుకుంటావు

అన్ని నీవనుచు 
అంతట నీవనుచు 


Sunday, January 10, 2021

**naked night**

రాత్రి మాత్రం ఒకటే

కానీ కాలాలు మాత్రం రెండు

 

నిర్నిద్ర పరుచుకున్నవి

నిరాలోచనతో నిద్రపోయినవి

 

అలుపు లేక ఒకటి

అలుపుతీరి ఒకటి

 

పొద్దుటే ఎర్రటి కన్నులతో

నీకు ఎదురుపడలేను

 

ప్రశ్నలు గుప్పించే చూపులు

నన్ను తరుముతాయి

 

I can’t explain the void

I can’t hide it either

 

I just can ignore you

 

కారణాలు లేని లేమిని ఎలా చెప్పగలం

కారణమున్నా చెప్పలేనితనాన్ని ఎలా దాచగలం

 

But I don’t really know

How to convince the night

 

It crawls like a shadow

Nobody can see that its naked

 

It’s the truth

Just this