Right disabled

Friday, September 3, 2021

**the altered consciousness**

 Who are you?


ఈ ప్రశ్న వేయడానికి ఆలోచన ఎక్కడిదో మరి


చలనం లేని కొలనులో

ఆకాశాన్ని, నక్షత్రాలను,

నన్ను నేను చూసుకున్నంతగా

నిన్నెప్పుడు చూస్తానా అని


Every time I feel you

It alters my consciousness


భూమి శరీరాలను కలిపేసుకున్నంత లాఘవంగా


అంతటా ఆవరించిన మానసికావరణం

అంతర్లీన తరంగవేగం

అదొక జాల ప్రకృతి


అది నువ్వేనా?


Endless transformation

Beyond meaning and reason

It is you

And only you


రూపాంతర మోహావేశ ముగ్ధకాంతా

అరూపలావణ్య అంతర్నిహితా


The way you transcend

Inspires me to mingle

We are not meant to unite

For we are inseparable


కిటికీలోంచి చూస్తుండగా

వెనక్కి తరలి వెళ్ళిపోయిన కాలాలను వదిలేసి

మిగిలిన నన్ను మాత్రం నీకిచ్చుకోను

నేనంతా నీకే


అంతా చూస్తూ మైమరపు నాది

అంతటా ఉంటూ పై మెరుపు నీది

No comments:

Post a Comment