విరిగిపోయినవి
పగిలిపోయినవి
తప్పిపోయినవి
అంటరానివి తెలుసా
పారేస్తారు జనాలు
మళ్ళీ ఒక అతుకు వేయడానికో
కలిపి
కుట్టడానికో
ఓపిక లేక కాదు
అదొక వివక్ష
భళ్ళున పగిలిన
వాటిని
ఏదోక లోహంతోనో
కరిగిన అద్దంతోనో
మళ్ళీ కలిపేస్తే
ఎలా ఉంటుందో తెలుసా నీకు
I think you know the meaning of
Beautifully broken
Yet you don’t know
How to create an amalgamation
With the pieces
It’s an unprecedented puzzle
పగిలిన అద్దాలలో
అంతెరుగని
ప్రతిబింబాలకు
బాగా అలవాటు
పడిపోయిన వాడిని
I am a flawed piece you know
You can’t count my cracks
You can only know them when I glow
And my light illuminates those hairline grooves
శిధిలమయ్యే
కాలానికి
నేనొక అసంపూర్ణ
విగ్రహమై నిలవాలన్నది
నా అంతిమ కోరిక
ఏం?
బాలేదా?
అసలు నచ్చలేదా?
అయితే ఎక్కడికైనా
వెళ్ళినపుడు
ఏ పిల్లాడి
చొక్కానుంచో
విడివడి వేరుపడ్డ
గుండీ ఒకటి కనిపిస్తే ఏరుకో
దాన్ని పలకరించు
నేను
వినిపించకపోతే
నా నవ్వు
కిసుక్కున లీలగా వినిపించకపోతే
Your heart is not broken yet
When it breaks and you listen to that cracking sound
You can see real me
పాడైపోయిన వాటిని
ఎదురు విలువ
కట్టి
ఎందుకు కొనే
వాడినో
వాటిని ఇంకా
విడదీసి తరచి ఎందుకు చూసే వాడినో
నీకర్థమయ్యే
నాటికి
You will never be the same
You, then understand how all this formed
Experience the vessel’s scattering
That subtle sound and
That artistic separation
నువ్వొక ముక్క
నేనొక ముక్క