Like love
Pain is universal
An enigmatic language itself
అని కదూ అన్నాను
నీతో
నీకర్థమయి ఉండదు
ప్రేమలో
మునిగితేలుతున్న నీకెలా తెలుస్తుందిలే
ఈ రెండూ ఓకే అర్థపు
రూపాంతరాలని
దేనికీ చెందని
నాణెపు అనామక ముఖాలని
Why do you fool yourself, always?
Believe me, they co-exit
ఒకటి ఉంటే ఇంకోటి
ఉండదని
నువ్వు మోసం
చేయబడతావంతే
మొదటి దాని మత్తుకు
ఊహించలేనన్ని
రెట్లు
రెండోది చూపెడుతుంది
ఆ రెండూ
నీ నెత్తిమీద
వేలాడుతున్న కత్తికి కట్టబడిన
రెండు పల్చటి
దారాలంతే
You already know
Nothing lasts forever
Those strings entwine again
With the same knife at the end of the loose knot
ఆ రెండూ
సర్వాంతర్యాములు
తేడాలున్న
అన్యోన్యత ఆ రెండిటిదీ
చెట్టాపట్టాలేసుకుని
ప్రతి ఒక్కరితోనూ తిరుగుతూ
జీవితాలను
కడతేర్చేస్తాయి
జాగ్రత్త సుమీ
అందుకే నీలో
నువ్వుంటూ ఉండాలి అప్పుడప్పుడైనా
ఏనాడో చెప్పుకున్నావుగా
శరణమూ అభయమూ
రెండూ నీవేనని
Don’t let the anonymous duality fool you
Stay put
I say again
Names of those strings are love and pain
No comments:
Post a Comment