ఎంత వెలుగు వస్తే
మాత్రం
చీకటిని
మర్చిపోయేంత వెర్రివాడిని కాను
చీకటిని
చుట్టుకుంటూ చుట్టుకుంటూ
నీ నీడలో
మిణుకుమంటున్న కొన్ని చుక్కలను
నిర్దయగా
విదిలించేయకు
నువ్వింకా
నిద్రపోతున్నావని భ్రమపడి జోగుతున్నాయి
వాటిని కాసేపు
నిద్రపోనీ
వాటి కాలం
ముగిసిపోయేంతవరకూ
Why don’t you wait for me till I wake up?
You disappear with first light
I hate that
ఉన్నపళంగా వదిలి
వెళ్ళకు
కనుల నిండా
నిన్ను నింపుకుని
రాత్రీభవించిపోయాను
Light will never interest me anymore
All I got is
That darkness lurking inside me
It can only be kindled by your looks
పట్టపగలు కూడా
సరిగ్గా చూడలేని జనం
చీకటిని
నిందిస్తారు
నువ్వేమిటో
తెలీదు వాళ్లకు
మబ్బు కప్పుకున్న
సముద్రాన్ని నేను
నువ్వు
కురిసేకొద్దీ నన్ను నింపి
నేను ఎగిసేకొద్దీ
నిన్ను కూర్చి
How can I put this into words?
Is there a name for this?
Or is it just that simple?
No comments:
Post a Comment