కిర్రుకిర్రుమంటుంటే
వయసైపోయిందేమిటే
అని
అడిగాను
నాకు
వయసైపోలేదురా
మీ
వయసుజోరే పెరిగిందంటూ
నాతో
సరసాలాడింది
ఎన్ని
జంటలను మోసావో
నీకు
ఓపికెక్కువే అని అంటే
మొదట్లో
ఇబ్బందిగానే ఉండేది
తర్వాత
అలవాటైపోయిందిరా అబ్బాయ్
అంటూ
వేదాంతం మాట్లాడింది
పరుపులు,
దిండ్లు, దుప్పట్లు మారాయి కానీ
నేను
మారలేదంటూ
పైపై
సొబగులెన్నున్నా
అంతఃసౌందర్యమే
ముఖ్యమంటూ
ఆత్మ
తత్వాన్ని
అవలీలగా
బోధించేసింది
అనుభవం
రంగరించిన
పండు
ముత్తైదువ లాంటి
మా
పట్టెమంచం
No comments:
Post a Comment