ముందు
కారును
ముద్దెట్టుకుని మరీ
ముద్దెట్టుకుని మరీ
ముందుకెళ్లమని
అడుగుతోంది
వెనుక
కారు
నగరపు
రోడ్లపై
-----------------
భాగమతీ
నగర కంఠాన
మణిహారమనేమో
నెక్లెస్
రోడ్డు
మునిమాపు
వేళ
మిలమిలా
మెరుస్తోంది
-----------------
హుసేన్
సాగర్ లో కంపును
నేనొక్కడినే
భరిస్తున్నప్పుడు
సమాజంలో
కంపును
మీరింతమంది
భరించలేరా
అని
అడుగుతున్నాడు
మాటల్లోనూ
చేతల్లోనూ
నిలకడలోనూ
మార్పులేని
గౌతమ
బుద్ధుడు
-----------------
పంజరంలో
పక్షిలా
బాల్కనీలోని
కుండీలో
మొక్క
ఆశగా
చూస్తోంది
ఆకాశం
వంక
-----------------
రెక్కలు
ముడుచుకున్న స్వేచ్ఛ
కిచకిచమంటూ
పంజరంలో
కనిపించింది
ఎర్రగడ్డ
సండే మార్కెట్లో
-----------------
దాహం
పాళ్ళు తగ్గట్లేదుగానీ
నగరంలోని నీళ్ళ ట్యాంకు రేటే
ఎగిసిన
సునామీ అలలా
అలా
పెరిగిపోతోంది
-----------------
రోడ్లు
విచ్చలవిడిగా
తలస్నానం
చేశాయి
వర్షపు
నీటి నురగలో
-----------------
రైల్వేస్టేషన్
లో నిలబడితే
పొగమంచు
వెలుగులో
మెలికలు
తిరుగుతూ
వచ్చి
ఆగింది
లోకల్ ట్రైను
No comments:
Post a Comment