Right disabled

Monday, December 17, 2012

**ఆగమనాభిలాష**

విత్తనం లోపల
ఎక్కడో మూల
అంకురం ముడుచుకుని
వేచి చూస్తూ ఉంది
నువ్వెప్పుడొస్తావో అని

తడి తగిలితే చాలు
ఎప్పుడు ఒళ్ళు విరుచుకుని
కొత్తరూపు దిద్దుకుందామా అని

మళ్ళీ మళ్ళీ
తన చిట్టి చేతులు చాచి
నిన్నెప్పుడు ఒడిసిపడదామా అని
కమ్మటి కలల్లో
కలవరిస్తూ ఉంది

తొలకరి చినుకా 
ఎప్పుడు నీ రాక

1 comment:

  1. మీ కవితకోసం మా నిరీక్షణ కూడా ఇదే తీరులో ఉంటుంది రాజుగారు ....ధన్యవాదాలు

    ReplyDelete