Right disabled

Sunday, November 29, 2020

**the residence**

అడుగులు ఎటు పడుతున్నాయో కూడా తెలియదు

తల తిప్పి చూస్తే

నీ ఇల్లు లాంటి ఇల్లు

 

I just arrive at the doorstep

As if your abode invites me

 

I don’t know

 

ఏమిటిలా రాక అని నువ్వడగవు గానీ

నీ ఇల్లడుగుతుంది

 

అల్లుకున్న లతలూ, పువ్వులూ చూడటానికా

లేక ఇంకేదో కావాలనా?

 

ఏం చెప్పను?

 

I fee like it drags me into it

I feel that its mine

Somewhere in the distant past

 

అంతు తెలియని శూన్యాన్ని నింపుకున్న ఇల్లు నీది

రాకుండా ఎలా ఉంటాను

 

That home is very me

Thursday, November 12, 2020

**the longing**

నాదొక గడ్డిపువ్వు లాంటి జీవితమని

వేరెక్కడికీ వెళ్ళకుండా

ఆ గడ్డి మొక్కకే

ఒకటి తరువాత ఒకటిగా

నేనే గడ్డిపూలై పూస్తుంటానని


ఎలా చెప్పను


I can never know

How I bloom and

How I fall back into your invisible fold


మానస మందార తోటల్లో

సృష్టి రహస్యానివై సంచరించిన దానవు

మేఘాల పరుపులపై విశ్రమించి

శూన్యపు అంచులను మీటుతూ

ఆదినాదాన్ని సృజియించిన దానవు


That primordial sound resonates

It cleanses my senses

And I can’t see you

I question myself, why


ధూళికాధూమ్రపాలినివి

గడ్డిపూల పుప్పొడి నీకేపాటి


శబ్దమై విస్తరించే నీకు

ఈ గడ్డి పువ్వు గాలికి కదిలిన సవ్వడేపాటి


సర్వప్రాణ సంస్థితవైన నీకు

ఈ చిన్న ప్రాణమేపాటి


All I asked for is a bunch of moments

Moments of life

Moments of deep and sacred union

I need nothing more


నీ ఆలోచనను మోస్తూ బ్రతకనీ

నీ ఆలోచనతోనే నన్ను అంతమైపోనీ


I longed for this

Monday, October 19, 2020

**the fall**

లోన కురిసే వర్షాన్ని కావలించుకోలేము

కండ్లలో కురిసే వానను కాదనలేము


అడివిలో బతికితే కదా 

ఈ లోకమెంత రాక్షసమైనదో తెలిసింది


Please be my forest 

Take me into you like it does

Let me break in that silence


నన్ను నీలో 

ఒక ఋషిని చేసేసుకో 

అలా ఉండిపోతాను నీ తపస్సులో 

Sunday, September 6, 2020

**mischief maker**

 వెయ్యి రేకుల పూవు చాలదా నీకు

నా ఆలోచనల్లో పసి పాపవై పారాడతావెందుకు


జన్మరాహిత్యమే కదా నేను కోరుకుంది

అది తీరనప్పుడు మిగితా కోరికలు ఉంటేనేమి పోతేనేమి


ఆజన్మ స్నేహితుడనై

నీ పక్కనుండాలనే కదా ఇన్నాళ్ళు వేచింది

వేకువ కూడా తీరకుండా 

ఎలా వెళ్ళేది?


Unimaginable mischief is your virtue

I am just a spectator


నిన్ను తప్పి ఏమి చేయగల నేర్పుందని 

ఇలా తరుముతావు


I asked you one thing

Let me be a string in your weave 


ఇంత అల్లరీ నన్ను ఊరించడానికి కాకపోతే 

నువ్వేమిటిలా

నేనేమిటిలా


My dear mischief maker

play as you wish

but

grant me your presence

forever


నువ్వు జ్ఞానానివి

నేను పిపాసిని


 

Friday, July 10, 2020

**that unapologetically flawed one**

విరిగిపోయినవి

పగిలిపోయినవి

తప్పిపోయినవి

అంటరానివి తెలుసా

 

పారేస్తారు జనాలు

మళ్ళీ ఒక అతుకు వేయడానికో

కలిపి కుట్టడానికో

ఓపిక లేక కాదు

అదొక వివక్ష

 

భళ్ళున పగిలిన వాటిని

ఏదోక లోహంతోనో

కరిగిన అద్దంతోనో

మళ్ళీ కలిపేస్తే ఎలా ఉంటుందో తెలుసా నీకు

 

I think you know the meaning of

Beautifully broken

 

Yet you don’t know

How to create an amalgamation

With the pieces

It’s an unprecedented puzzle

 

పగిలిన అద్దాలలో

అంతెరుగని ప్రతిబింబాలకు

బాగా అలవాటు పడిపోయిన వాడిని

 

I am a flawed piece you know

You can’t count my cracks 

You can only know them when I glow

And my light illuminates those hairline grooves

 

శిధిలమయ్యే కాలానికి

నేనొక అసంపూర్ణ విగ్రహమై నిలవాలన్నది

నా అంతిమ కోరిక

 

ఏం?

బాలేదా?

అసలు నచ్చలేదా?

 

అయితే ఎక్కడికైనా వెళ్ళినపుడు

ఏ పిల్లాడి చొక్కానుంచో

విడివడి వేరుపడ్డ గుండీ ఒకటి కనిపిస్తే ఏరుకో

దాన్ని పలకరించు

నేను వినిపించకపోతే

నా నవ్వు కిసుక్కున లీలగా వినిపించకపోతే

 

Your heart is not broken yet

When it breaks and you listen to that cracking sound

You can see real me

 

పాడైపోయిన వాటిని

ఎదురు విలువ కట్టి

ఎందుకు కొనే వాడినో

వాటిని ఇంకా విడదీసి తరచి ఎందుకు చూసే వాడినో

నీకర్థమయ్యే నాటికి

 

You will never be the same

You, then understand how all this formed

Experience the vessel’s scattering

That subtle sound and

That artistic separation

 

నువ్వొక ముక్క

నేనొక ముక్క