Right disabled

Tuesday, February 9, 2021

**the prelude**

 ప్రవహించిన కాలపు క్షణాలు వాడని పువ్వులు

మాలగా గుచ్చడం ఒక అలవాటు

చివరికి అలంకరించుకోకుండా వెళ్ళిపోవడం

ఇదే జీవితం అనిపిస్తుంది ప్రతిసారీ

 

as that very day arrives

all the cuckoos sing

waving their tails

all they ask is to have a look

at all the walks

descended into time

 

this is the prelude

 

my dear long-time friend

for the day that is coming

 

అలా మిగిలిపోయిన ఎన్నో మాలలు

ఏ గుర్తూ వదలాలని ఉండదు

అల్పసంతోషిత్వాల్ని నేర్పుగా వదులుకోవడమే

మరపును చేరదీయడం ఒక తపస్సు

 

O! dear!

 

I stopped looking for gifts

I closed doors for sweet musicals

As the silence spreads like evening darkness

I let the rejoicing happen

No embellishments

No ecstasy

 

Nothingness is the virtue

 

ఒక్కొక్క సంవత్సరమూ ఒక్కొక్క నిప్పు

కొద్ది కొద్దిగా కాలుతుంది సరం

అందమైనదో కాదో తెలియని అనంతానికి దారి ఇది

 

ఒక తోడు

ఒక గొప్ప కాఫీ

కొన్ని పుస్తకాలు

ఒక మెత్తటి కుర్చీ

ఒక దట్టమైన నిర్లిప్తత

 

This is a birthday song

Monday, January 25, 2021

**that inevitable you**

I wonder what you are

not like in that kids' poem

you push yourself to the shore
with those soft fingers of the sea
you touch me with vigor

నీ నుంచీ నాకేమీ వద్దు నువ్వు తప్ప
అంటూ సాంతం ఆక్రమించేసుకుంటావు

అన్ని నీవనుచు 
అంతట నీవనుచు 


Sunday, January 10, 2021

**naked night**

రాత్రి మాత్రం ఒకటే

కానీ కాలాలు మాత్రం రెండు

 

నిర్నిద్ర పరుచుకున్నవి

నిరాలోచనతో నిద్రపోయినవి

 

అలుపు లేక ఒకటి

అలుపుతీరి ఒకటి

 

పొద్దుటే ఎర్రటి కన్నులతో

నీకు ఎదురుపడలేను

 

ప్రశ్నలు గుప్పించే చూపులు

నన్ను తరుముతాయి

 

I can’t explain the void

I can’t hide it either

 

I just can ignore you

 

కారణాలు లేని లేమిని ఎలా చెప్పగలం

కారణమున్నా చెప్పలేనితనాన్ని ఎలా దాచగలం

 

But I don’t really know

How to convince the night

 

It crawls like a shadow

Nobody can see that its naked

 

It’s the truth

Just this

Sunday, November 29, 2020

**the residence**

అడుగులు ఎటు పడుతున్నాయో కూడా తెలియదు

తల తిప్పి చూస్తే

నీ ఇల్లు లాంటి ఇల్లు

 

I just arrive at the doorstep

As if your abode invites me

 

I don’t know

 

ఏమిటిలా రాక అని నువ్వడగవు గానీ

నీ ఇల్లడుగుతుంది

 

అల్లుకున్న లతలూ, పువ్వులూ చూడటానికా

లేక ఇంకేదో కావాలనా?

 

ఏం చెప్పను?

 

I fee like it drags me into it

I feel that its mine

Somewhere in the distant past

 

అంతు తెలియని శూన్యాన్ని నింపుకున్న ఇల్లు నీది

రాకుండా ఎలా ఉంటాను

 

That home is very me

Thursday, November 12, 2020

**the longing**

నాదొక గడ్డిపువ్వు లాంటి జీవితమని

వేరెక్కడికీ వెళ్ళకుండా

ఆ గడ్డి మొక్కకే

ఒకటి తరువాత ఒకటిగా

నేనే గడ్డిపూలై పూస్తుంటానని


ఎలా చెప్పను


I can never know

How I bloom and

How I fall back into your invisible fold


మానస మందార తోటల్లో

సృష్టి రహస్యానివై సంచరించిన దానవు

మేఘాల పరుపులపై విశ్రమించి

శూన్యపు అంచులను మీటుతూ

ఆదినాదాన్ని సృజియించిన దానవు


That primordial sound resonates

It cleanses my senses

And I can’t see you

I question myself, why


ధూళికాధూమ్రపాలినివి

గడ్డిపూల పుప్పొడి నీకేపాటి


శబ్దమై విస్తరించే నీకు

ఈ గడ్డి పువ్వు గాలికి కదిలిన సవ్వడేపాటి


సర్వప్రాణ సంస్థితవైన నీకు

ఈ చిన్న ప్రాణమేపాటి


All I asked for is a bunch of moments

Moments of life

Moments of deep and sacred union

I need nothing more


నీ ఆలోచనను మోస్తూ బ్రతకనీ

నీ ఆలోచనతోనే నన్ను అంతమైపోనీ


I longed for this