బాగుంటుంది
బాల్కనీకి కట్టిన
తెరల ఊగిసలాట
అవి కొంత
తప్పుకున్నప్పుడల్లా
మెరుస్తూ
కనిపించే సముద్రం
Do you know
Those blinds can’t stay put
They always want to touch the breeze
They are full of lust
గట్టుమీద బెంచిపై
కూర్చుని
పల్చటి
ఒంటరితనాన్ని శ్వాసిస్తున్నప్పుడల్లా
అటు రమ్మని ఒక
పిలుపు
ఎప్పుడో ఏదో
ఒకానొక రోజు
సముద్రం ఈ చోటును
ముంచేస్తుంది కదా అని
లీలగా ఒక ఆలోచన
ఎత్తులన్నీ
లోతులైపోతాయి కదూ
I can say now
What’s high today will be a trench one day
I am so sure that I am in unreachable depths
ఈదడం కన్నా నీటికి
అలవాటు పడటం
లోతుకి
జారిపోతున్నా
అక్కడున్న
దారుణమైన నిశబ్దాన్ని
కిమ్మనకుండా
తీసుకోవడం
This is damn good you know
Its not about strength
It is purely evolutionary
ఇప్పుడేం తక్కువా
గిజగిజలాడే
ప్రపంచంలో కూడా
ఊపిరిసలపని
రోజొకటి
అప్పుడప్పుడూ రాలేదా
ఊపిరి అందనీయని
భావమొకటి
ముందరి కాళ్ళకు
అడ్డుపడలేదా
The upside is not less than the downs
Many times, it is good to go low
వెలుతురును
వదిలేసి కొంతకాలం
మసకల్లోనే
మసలుదాం
నీడల్లో
ఒదిగిపోదాం
What say, my dear
Let us get smeared with some dark
Let us get piously tarnished
చీకటికి ప్రతీకవై
నా చేయందుకో
నీడనై నే ప్రతి
దీపానికీ విశ్రాంతినిస్తా
Let the canopy float above us