వర్షాకాలంలో
ఒకానొక
రోజు
ఆఫీసులో
కూర్చుని
ఏం
తోచక
కిటికీలోంచీ
చూస్తే
జోరుగా
కురుస్తున్న
చిక్కటి
చినుకుల్లో
నిశ్చలంగా
నింపాదిగా
తనివితీరా
తడుస్తున్న
నగరం
కనబడింది
ఎంచక్కా
తడుస్తున్నానని
చంటిపిల్లలా
మురిసిపోతోందేమో
కానీ
నగరానికి తెలీదు
ఆ
చినుకులు
కాలుష్యపు
సెగనుండీ
ఎగసిన
పొగ కలిసినవని
అది
కల్తీ వర్షమని
నేలమీదకన్నా
ప్రమాదకరమైన
గాలిలోని
నల్లటి
కనిపించని బురదలో
తడుస్తున్నానని
చక్కటి
మంగళస్నానం
చేస్తున్నాననుకుంటున్న
నగర
సుందరికి
ఈ
విషయం తెలిస్తే
బావురుమని
ఏడుస్తుందేమో
అనుకుంటూ
ఇంతకీ
ఏం రాశానో అని
కిందకు
చూస్తే
తెల్లటి
కాగితం పై
నీలి
సిరా అక్షరాలతో పాటు
రెండు
నల్లటి చారికలు కూడా
కనబడ్డాయి
అవి
నా మనసు మూగవేదనకు
పొంగి
రాలిన అశ్రువులు
అవి
కూడా కల్తీ అయిపోయాయి
No comments:
Post a Comment