అక్షరం
అది
అవ్యక్త భావ తరంగాల అంకురం
ఒక్కొక్క
తరంగమూ తగిలినప్పుడల్లా
నాలోని
అంతఃచేతన
ఇంతై
ఇంతింతై
నా
కళ్ళు తట్టుకోలేనంత
వెలుగు
రేఖలు ప్రసరిస్తుంది
అక్షరం
నైరాశ్యంతో
ఎండిన నా నరాల్లో
ఎప్పటికప్పుడు
ప్రాణశక్తితో
పాటు
స్పందనలను
కూడా నింపే ఒక వరం
నాలో
అక్షరాలు కదులుతున్నాయి
నిత్యమూ
సత్యమూ శాశ్వతమూ
అద్భుతమూ
అద్వితీయమూ
అయిన
అక్షరాలు నాలోని రుధిరంతోపాటు
పరుగులు
తీస్తున్నాయి
నేను
ఏమి చేసినా
ఏమి
చూసినా
ఎక్కడ
ఉన్నా
ఎవరితో
ఉన్నా
నాలోపలి
తెలియని
అక్షర
జలపాతాల హోరు
నాకు
వినిపిస్తుంది
అమంత్రమక్షరం
నాస్తి అన్నట్టు
ప్రతి
అక్షరం మంత్రమై
నా
చెవుల్లో ఘోషిస్తున్నాయి
ఎంతచెప్పినా
ఎందరితో
చెప్పుకున్నా
ఎంత
చవిచూసినా
తనివి
తీరని అమృతానుభవమది
అమ్మలా
అక్కున చేర్చుకునే అక్షరం
ప్రేయసిలా
నన్ను తనలో
పొదుపుకునే
అక్షరం
ఆడతనంలా
అనిర్వచనీయమైన అక్షరం
అంతర్వాహినిలా
అంతుతెలియని అక్షరం
నా
ప్రయాణం అక్షరం
నా
జీవితం నిండా అక్షరాలు
నేను
నడిచిన దారి నిండా కూడా
నాలోంచి
రాలి పడిన అక్షరాల మొలకలు
ఆ
మొలకలు కూడా మోసులెత్తి
అక్షర
సుమాలు విరిసి
అక్షర
బీజాలు కురుస్తూ
మళ్ళీ
అక్షరాలను మొలకెత్తిస్తూ
అక్షరానికి
నాశనం లేదు
అలాగే
అక్షరాలను నింపుకున్న
నాకు
కూడా
అమరత్వం
అంటే
అక్షరాన్ని
ఆరాధించటం
చివరకు
అదే అక్షరంలో కలిసిపోవడం
No comments:
Post a Comment