ఏమిటే కొంటె జాబిల్లీ
అసలే విరహ వేదనలో కాలిపోతున్నానంటే
ఇంకాస్త వెన్నెలలు చల్లి
నా బాధను మరికాస్త పెంచుతావా
ప్రియురాలి ఊహల జల్లుల్లో
నేను ఇప్పటికే తడిసిపోయి ఉంటే
నా మీదకు వెన్నెల మడుగులు కుమ్మరించి
నన్ను నిండా ముంచేస్తావా
అసలే నా వయసంతా
అడవిగాచిన వెన్నెల అయిపోతోందని
అతి కష్టంగా పోల్చుకుంటున్నానే
కాస్తయినా కనికరం లేదెందుకు నీకు
నా మదిలో మండే ప్రణయ జ్వాలలకు తోడు
నీ వెండి పుంజాలు కోరికల నెగళ్లు వేస్తున్నాయి
నీకిది న్యాయమా
ఓ ప్రేయసీ
ఈ తాపసి మొర వినరావా
నీ కౌగిట నను చేర్చి
ఈ జాబిల్లి కాంతుల కారాగారం నుంచీ
విముక్తుడిని చేయరావా
తార మురిసిపోయె .... శశాంక వెల్గు ఎగయ !
ReplyDeleteఓ ప్రేయసీ ! వెన్నెల సెగ నుండీ విముక్తుడిని చేయరావా !
చాలా బాగుంది .