అదొక
కనికరం లేని
రాక్షస హస్తం
రాక్షస హస్తం
నీ
ఆశలని ఆశయాలను
కసిని
తెగింపును
నిర్దాక్షిణ్యంగా
నలిపేస్తుంది
అదొక
భయంకరమైన
మాయ
నీలోని
అభ్యుదయాన్నీ
ఆలోచనను
ఆవేశాన్ని
నువు
వేసే ప్రతి అడుగునూ
చీకట్లతో
కమ్మేస్తుంది
నీ
మనసును
నవ్వడానికి
వీలుపడని
అధరద్వయంలా
కదలిక
లేని గుండెలా
మసకబారిన
చూపులా
ఉనికి
లేని ప్రపంచంలా
మార్చేస్తుంది
దాన్ని
నిర్లిప్తత అంటారు
దగ్గరకు
రానివ్వకు
No comments:
Post a Comment