శబ్దం లేనితనాన్ని చూసావా ఎప్పుడైనా
కాస్త దగ్గరగానైనా గాలి, మిగితా సవ్వడులు లేకపోవడం
కొద్దిగా తెలిస్తే
నువ్వేమవుతావో తెలుసా?
పిచ్చి పడుతుంది కదూ
ఇదంతా ఇప్పుడు చెబుతున్నానని
నాకు పిచ్చనిపిస్తుంది, కాదూ?
We are
born with silence at our fingertips
Did you
observe
Lying
on our backs
We look
at our fingertips
Move them
mysteriously
And smile
and giggle without a reason
మునివేళ్ళ వెంబడి నిశ్శబ్దమలా
మెరుపుల్లా కదులుతూ ఉంటుంది
ఇది పోలిక మాత్రమే
వినికిడి అవసరమే ఉండదసలు
కంటికి కూడా తెలీదంతే
నిశబ్దం గురించి మాటల్లో చెప్పవలసి వస్తోందనే నా బాధల్లా
పెదాలు విచ్చుకునేందుకు ఎంత శబ్దం చెయ్యాలి?
నీకు తెలీదా
నేను చెప్పాలా
గుసగుసలాడటమే వినబడకపోతే
నిశ్శబ్దంగా గుసగుసలాడటం గురించి ఏం చెప్పగలం
పైకి చూస్తూ నీలిరంగు దాటిపోతే
అంతా దారుణమైన శబ్దం లేనితనమే
సముద్రం బాగుంది కదా అని లోతుకు పోతే
అదోరకమైన భారమైన నిశ్శబ్దం
ఇక నేను అదెలా ఉంటుందో చెప్పలేను
నీకు తెలిస్తే నువ్వేమైనా చెప్పగలవా ఏమిటి?
ఇదీ అంతే
నీకైనా నాకైనా
This is
why we are known as
Silent
whisperers
We just
don’t speak
We propagate
the language of nothingness
అర్థం కాలేదా?
Mingle
with us
We’ll
let you know
Let’s
get the taste of it
ఊరకనే కాదులే
ప్రతిదానికీ ఖరీదు ఉంటుంది
After
all
What’s
free in this world!
కన్ను కొట్టి పిలిచిన సంగతి నీకు తెలీనేలేదు కదూ
నిశ్శబ్దమంత బాగుంటుంది
మరి