కసెక్కిన
యవ్వన సర్పం
కసుక్కున కాటేస్తే
నిలువెల్లా నిండిపోయిన
విషం లాంటి ప్రేమ
నన్ను కుదిపేస్తోంది
నిలబడనీయదు
కూర్చోనీయదు
పడుకోనీయదు
పడుకున్నా
నిదురపోనీయదు
ఎన్నిరాత్రులు
మోకాళ్ళు కడుపులో పెట్టుకుని
పడుకున్నానో
అసలు
నిదురే లేకుండా పోయింది
నిదురపోయినా
కలలో నువ్వొచ్చి
నన్ను లేపేస్తావు
నా బాధ
నీకు అర్థం అవుతోందా పిల్లా?
No comments:
Post a Comment