గుండె చేతులు పట్టుకుని
గంతులేయిస్తావు
మనసును పసిదానిని చేసి
పకపకా నవ్విస్తావు
కదలని కాళ్ళను కుదిపి
నాట్యమాడిస్తావు
మూగ గొంతును మలిపి
మాటలాడిస్తావు
కన్నీళ్లను కలిపేసుకుని
కళ్లను కడిగేస్తావు
ముత్యపు చిప్పలో పడితే
ముత్యమైపోతావు
సంద్రంలో పడితే
సముద్రుడిలో ఐక్యమైపోతావు
పుడమిని తాకితే
నేలతల్లి ఒడిలోకి
ఇంకిపోతావు
యేటిలో పడితే
ముందుకు దూకుతూ
వెళ్లిపోతావు
ఓ చిత్రాల చినుకు చుక్కా
నిన్ను ఎక్కడని వెతకను
నీ రుణం
ఎప్పటికి తీర్చుకోను...?
No comments:
Post a Comment