Right disabled

Monday, August 27, 2012

**నా బుజ్జి మనసు **

అంతవరకు ముడుచుకుని
మూల కూర్చున్న
నా మనసు
కమ్ముకొస్తున్న
కారు మేఘాల్ని చూడగానే
లేచిన లేడిలా
పరుగులిడుతుంది

ఆశల రెక్కలు కట్టుకుని
విశాల గగన వీధిలోంచి
దూకడానికి సిద్ధంగా ఉన్న
చిట్టి చినుకులను
ఆర్తిగా పలకరించివస్తుంది
అవి కిందకు వస్తాయని తెలిసినా

అప్పటికీ తనివి తీరక
వడగళ్ళ రాళ్లపై
తన పేరు చెక్కి వస్తుంది
అంతటితో ఆగక
వాటితో పాటు
కిందకు ఉరికి వస్తుంది

వానలో తడవమని
వడగళ్లను ఏరుకొమ్మని
ఒకటే పోరు పెడుతుంది
నేను తడవకపోయినా
తను తడుస్తూ బాధలనూ
మలినాలనూ కడిగేసుకుని
స్వచ్ఛంగా మళ్ళీ
నాలో దూరుతుంది
నన్ను తిరిగి
నిత్యనూతనంగా మార్చేస్తుంది
నా పిచ్చి మనసు
నా మంచి మనసు
నా బుజ్జి మనసు

No comments:

Post a Comment