అనగనగా ఒకదేశం
ఆ దేశం పేరు
అనంగ దేశం
రాజు ప్రియుడు,
రాణి ప్రేయసి
ప్రజలు కూడా
ప్రేమికులేనట
ఆ దేశం లో
సంవత్సరమంతా
ప్రేమ ఋతువేనట
ఎప్పుడు కావాలంటే అప్పుడు
వానలు కురుస్తాయట
ఎండ కాస్తుందట
మంచు కురుస్తుందట
పూలు పూస్తాయట
వెన్నెల కురుస్తుందట
చుక్కలు మెరుస్తాయట
జీవితమనే పంట
అక్కడ బాగా పండుతుందట
ఏం కావాలన్నా
ఎంత కావాలన్నా
దొరుకుతాయట
అంతా సుందరమూ,
సుగంధమయమూనట
ఆ దేశానికి వెళ్లాలంటే
ఒకటే అర్హతట
అది
స్వచ్ఛంగా
అరమరికలు లేకుండా
ప్రేమించడమేనట
అక్కడికి వెళ్ళినవారే కానీ
తిరిగి వచ్చినవారు లేరట
నేను దారిలో ఉన్నాను
మరి మీరో....!
No comments:
Post a Comment