నీ ఎదురుగా కూర్చుని
నీ కళ్లలోకి చూస్తుంటే
ఏవో తెలియని
అందమైన అగాధాలు
నన్ను
లోపలికి లాగేసుకుంటాయి
నీలోంచి పొంగే
ప్రణయ గంగ
నా జన్మాంతర పాపాల్ని
కడిగేస్తుంటుంది
సడి చేసీ చెయ్యనట్టు ఉండే
నీ చిరునవ్వు కోసం
ఎన్ని యుగాలైనా
వేచి ఉండాలనిపిస్తుంది
తళుక్కున మెరిసే
నీ ముక్కుపుడక విరిసే
వెలుగు పూవుల జడిలో
ఎని సార్లు తడిసినా
తనివి తీరదెందుకో
No comments:
Post a Comment