నేల మీద జాబిలి
నాదు చెలియ చెక్కిలి
వెలుగు జిలుగు దివ్వెలు
నాదు చెలియ కన్నులు
సాగర సమీర ప్రశాంతము
నాదు చెలియ వదనము
మధుర సుధా పానము
నాదు చెలియ గానము
సరసయుక్త చెణుకులు
నాదు చెలియ పలుకులు
విరియు మెరయు పువ్వులు
నాదు చెలియ నవ్వులు
ప్రకృతి కాంత కవనము
నాదు చెలియ గమనము
జీవమున్న శిల్పము
నాదు చెలియ రూపము
అంతులేని గగనము
నాదు చెలియ హృదయము
No comments:
Post a Comment