Right disabled

Monday, August 27, 2012

**వర్షం కథ**

నడుము నునుపు
ఎక్కువైందో
లేక వయ్యారపు ఊపు
ఎక్కువైందో

మేఘపు కడవ
చంకనెట్టుకుని నడుస్తున్న
గగన సుందరి
దాన్ని
చటుక్కున వదిలేసింది

భళ్ళున పగిలిన
కడవ శబ్దమే ఉరుమైంది
పగిలిన ముక్కలే
మెరుపులయ్యాయి
అందులోని నీరే
వర్షమైంది

కాదంటారా....

No comments:

Post a Comment