నేనంటే ఎంత ఇష్టమో
నిరంకుశ నిశి రాణికి
గాఢాంధకారపు కౌగిలిలో
చుట్టేసుకుంటుంది
తన నల్లటి కురులలో
దాచేసుకుంటుంది
వేధించే జ్ఞాపకాలకు
నేను కనిపించకుండా
చీకట్ల పరదాలు
కప్పేస్తుంది
తనలో నన్ను
నిదురపుచ్చి జోకొడుతుంది
తొలి వెలుగులు
ఈ లోకపు నిరాశను, నిస్సత్తువను
తరిమేసే వేళ
నను నిదురలేపుతుంది
మళ్ళీ రాత్రికి వస్తానంటూ
మధురమైన గుర్తులు మిగిల్చి మరీ
మరలిపోతుంది
నేనంటే ఎంత ప్రేమో
నిష్కల్మష నిశి రాణికి
No comments:
Post a Comment